Search
  • Follow NativePlanet
Share
» » రంగుల పేర్లు ఉన్న భారత దేశ నగరాల వెనుక ఉన్న రహస్యాలు

రంగుల పేర్లు ఉన్న భారత దేశ నగరాల వెనుక ఉన్న రహస్యాలు

By Vamsiram Chavali

భారత దేశం చాలా ఉత్సాహపూరితమైన మరియు రంగులమయమైన దేశం; దేశంలో కొన్ని రంగులు నగరాలకి మారుపేరుగా పెట్టబడ్డాయి.రంగుల పేరుతో నగరాలు పిలవబడ్డాయి అంటే మనకు ముందు గుర్తుకువచ్చేది గులాబి రంగు నగరం అయిన జైపూర్.భారత దేశంలో, ఉల్లాసవంతమైన రంగులకి ప్రసిద్ది చెందిన నగరాలు చాలానే ఉన్నాయి. కొన్ని నగరాలు వాటి రంగులతో ఎలా అనుసంధానించబడ్డాయో తెలియడానికి వెనకాల చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.ఉదాహరణకు , జైపూర్ గులాబి రంగు నగరం, జోద్ పూర్ నీలం రంగు నగరం,జైసల్మర్ బంగారపు రంగు నగరం. రంగులతో అనుసంధానమైన కొన్ని నగరాల గురించి ఈ కింద చూడండి.

ఎల్లప్పుడు ఆకుపచ్చగా ఉండే నగరం: తిరువనంతపురం

ఎల్లప్పుడు ఆకుపచ్చగా ఉండే నగరం: తిరువనంతపురం

కేరళ లో ఉన్న దాదపు అన్ని చోట్లు వివిధ ఆకుపచ్చదనంతో నే కప్పి ఉంటాయి.కానీ తిరువనంతపురం మాత్రమే ఎల్లప్పుడు ఆకుపచ్చగా ఉండే నగరం అని గాంధీ గారు పేరు పెట్టారు.గాంధీ గారు, దాని ఆకుపచ్చని పరిసరాలు మరియు కాలంతో పాటు పాతబడని పర్యావరణాన్ని చూసి ఈ పేరు పెట్టారు. అరేబియా సముద్రానికి మరియు పశ్చిమ కనుమల మధ్యలో నెలకొన్న ఈ ప్రదేశం అన్ని విషయాల్లో నిజంగా పచ్చనైనదే.ఈ నగరం కేరళ యొక్క పరిపాలనా పీఠమే కాకుండా ఎన్నో గుళ్ళకి, బీచులకి,కొండ ప్రదేశాలకి నెలవు.

PC: Ashcoounter

తెల్ల రంగు నగరం, ఉదైపూర్

తెల్ల రంగు నగరం, ఉదైపూర్

ఉదైపూర్ ని తెల్ల రంగు నగరం గా పిలుస్తారు; ఈ ప్రదేశం, లెక్కలేనన్ని అధ్భుతమైన సరస్సులు మరియు అందమైన పాలరాతి నిర్మాణాలకి ప్రతీతి.ఎక్కువ సరస్సులు ఉన్నందువలన ఈ ప్రదేశాన్ని "తూర్పు యొక్క వెనిస్" మరియు " సరస్సుల నగరం" గా కూడా పిలుస్తారు.రాజస్థాన్ లో ఉన్న చాలా నగరాల లానే ఉదైపూర్ లో ఉన్న పెద్ద పెద్ద కోటలు , సంవత్సరం అంతా జనాలను రప్పించే ప్రధాన ఆకర్షణగా కొనసాగుతాయి.ఈ నగరానికి ప్రాకృతిక అందాలు చూడటానికే కాకుండా చారిత్రక విలువలు తెలుసుకోడానికి కూడా యాత్రికులు దగ్గర నుంచే కాక ఎంతో దూరాల నుంచి వస్తారు.

PC: Suket Dedhia

బంగారపు రంగు నగరం,జైసల్మర్

బంగారపు రంగు నగరం,జైసల్మర్

థార్ ఎడారి యొక్క బంగారపు ఛాయలు,గోధుమ మరియు పసుపు రంగు వలన జైసల్మర్ కి బంగారపు రంగు నగరం గా పేరు వచ్చింది.థార్ ఎడారి బంగారం,పసుపు మరియు గోధుమ రంగు ఛాయ పులుముకొని ఉంటుంది, ముఖ్యంగా ఎడారి మట్టి మీద ఎండ పడ్దప్పుడు .జైసల్మర్ లో ఉన్న వివిధ రంగుల్లోని ప్రత్యేక సాంప్రదాయకమైన అందం ప్రతీ ఏడాది ప్రపంచం లో ఉన్న యాత్రికులందర్ని ఆకర్షిస్తుంది.

ఎంతో పేరు మరియు మర్యాద పొందిన ‘రాజస్థాన్ జానపద నృత్యం' మరియు సంగీతం కి జైసల్మర్ ప్రసిద్ధి.దేశీయ తెగలు ప్రత్యేక వేడుకలో, ముఖ్యంగా "సాం సాండ్ డ్యునెస్" అనే ఎడారి ఉత్సవంలో కల్బేలియ అనే జాపద నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

PC: DEZALB

నీలి రంగు నగరం, జోద్-పూర్

నీలి రంగు నగరం, జోద్-పూర్

నగరంలోకి ప్రేవేశించిన వెంటనే మనోహరమైన మెహ్రాన్గర్ కోట కనిపిస్తుంది,యాధృచ్చికంగా నగరంలో ఎత్తైన కట్టడం కూడా అదే.అక్కడి సముద్రం వలే నీలాకారం లో ఉండే ఇళ్ళను చూసి జనాలు ఎవరైనా ముగ్ధులవుతారు. ఇళ్ళకి విలక్షణమైన తీరుని ఇవ్వాలని, ఈ నీలి రంగు ఇళ్ళకు వేసే ధోరణిని మొదట బ్రాహ్మణులు మొదలుపెట్టారు.కాలాంతరం, ఈ పద్ధతి ప్రజలలో సాధారణమైపోయి నగరానికే విలక్షణమైన తీరు అయిపోవడం వలన నీలి రంగు నగరంగా పేరు వచ్చింది.

PC: Premaram67

గులాబిరంగు నగరం, జైపూర్

గులాబిరంగు నగరం, జైపూర్

రాజస్థాన్ కి రాజధాని అయిన జైపూర్, ప్రపంచవ్యాప్తంగా గులాబి రంగు నగరంగా ప్రసిద్ధి చెందింది.పురాతన కథ ప్రకారం, హేల్స్ యువరాజు మరియు విక్టోరియా మహారాణి ని ఆహ్వానించడానికి, 1876 లో నగరం మొత్తం టెర్రకోట గులాబి రంగు పూయబడింది.అప్పుడు నగరాన్ని పాలించే మహారాజా సావై రాం సింగ్, తరువాత నగరం లోని అన్ని భవనాలు మరియు ఇళ్ళు కి గులాబి రంగే వేయాలి అనే చట్టం జారీ చేసాడు; అప్పటినుంచి ఆ చట్టమే అమలవుతుంది.

PC: Firoze Edassery

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X