Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకాలో సోలోగా విహరించడానికి అద్భుతమైన ప్రదేశాలు..

కర్ణాటకాలో సోలోగా విహరించడానికి అద్భుతమైన ప్రదేశాలు..

ప్రయాణాలు చేయడం అంటే కొంత మందికి చాలా ఇష్టం. ఇంకొందరికి విలువైన జ్ఞాపకం, మరికొందరికి స్టెస్ బూస్టర్, విహారానికి వెళ్ళినప్పుడు మనసంతా దూదిపింజలా తేలిపోతుంది. మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రెండు మూడు రోజులు సెలవు దొరికితే చాలు టూర్ ప్లాన్ చేసుకోవడం ద్వారా మైండ్ ను ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు. కొత్త ప్రదేశాలు చూడటానికి వెళ్ళాలంటే తోడు ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఒంటరిగా ప్రయాణించడమే బెటర్ అంటున్నారు పరిశోధకులు.

ముఖ్యంగా మహిళలు సోలోగా ట్రావెల్ చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసాసం పెరుగుతుంది. రోజూ వారి పనులతో బిజీగా ఉండే మహిళలకు ఒంటరి ప్రయాణం కాస్త విరామాన్నిస్తుంది. ఇల్లు, కుటుంబం, ఆఫీస్‌ చట్రంలో తిరుగుతూ ఒత్తిడికి గురవుతున్నవారికి మానసిక సాంత్వనను ఇస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తాం.కానీ, సోలో ట్రావెల్‌ చేసేవారు వన్‌ ఉమెన్‌ షో. వారే రాజు.. వారే బంటు. ఇతరుల పై ఆధారపడకుండా జీవించడం నేర్చుకుంటారు. ఎన్నో చాలెంజెస్ ను దైర్యంగా ఎదుర్కొనే శక్తిని, తెలివిని పొందుతారు. అందుకు ఆధ్యాత్మికత గురువైన దలైలామా సైతం 'సంవత్సరానికొకసారి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి రండి' మీరు మునుపటి కన్నా చాలా ప్రశాతంగా, ఉత్తేజంగా ఉంటారని అంటుంటారు.

భారతదేశంలో సోలోగా ట్రావెల్ చేయడానికి అనేక ప్రదేశాలున్నాయి. అందుకే విదేశీయులు సైతం ఒంటరిగా భారత దేశం వచ్చి ఎంచక్కా తమకు కావాల్సిన ప్రదేశాలను తక్కువ ఖర్చుతో చూసి ఎన్నో ఆనందాలను మూట గట్టుకొని తిరిగి తమ దేశాలకు వెలుతున్నారు. ఇప్పుడు భారత దేశంలోని యువత కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. సోలో ట్రావెల్ వల్ల ఆనందాలు, జ్ఞాపకాలను మీ వెంట తీసుకెళ్ళడమే కాదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత దేశంలో సోలో టూరిస్టులకు అనువైన పర్యాటక ప్రాంతాలు చాలనే ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో గ్రీన్ సిటీగా పేరొందిన కర్ణాటక రాష్ట్రంలో సోలోగా మీరు చూడదగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. మరికెందుకు ఆలస్యం? మీకు మీరు బూస్ట్ అప్ అవ్వండి!

1. మైసూర్:

1. మైసూర్:

కర్ణాటకాలో చూడదగిన అందమైన ప్రదేశాల్లో ఒకటి మైసూర్. సోలో ప్రయాణించడానికి కూడా ఇది సురక్షితమైన ప్రదేశం. మైసూర్ లో మైసూర్ ప్యాలెస్ తో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఈ ప్రదేశాలతో పాటు అద్భుతమైన వంటలు రుచి చూడటట, సిల్క్, సాండిల్ వుడ్ మరియు పురాతన దేవరాజా మార్కెట్ లో సువాసన భరితమైన మసాలా దినుసులు కొనుగోలు, సాయంత్రానికల్లా చాముండి హిల్స్ పై సన్ సెట్ చూడటం ఇవన్నీ మీ సోలో ట్రిప్ ను మైమరిచేలా చేస్తుంది.

2. బైలకుప్పె:

2. బైలకుప్పె:

కూర్గ్‌కి సమీపంలో బైలకుప్పె అనే ప్రాంతం ఉంది. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్‌ సెటిల్‌మెంట్‌. ‘బైలకుప్పె’ బౌద్ధాలయం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటుంటారు. బైలకుప్పె మడికెరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూర్గ్‌కు 94 కిలోమీటర్లత దూరంలో నగర్‌హౌలె నేషనల్‌ పార్కు ఉంది. ఇది కూడా చూడాల్సిన ప్రాంతం. ఇది అతి పెద్ద వన్యప్రాణుల పార్కు. ఇక్కడ పులులు, ఏనుగులు, నీటిగుర్రాలు, తోడేళ్లు వంటివెన్నో జంతువులు కనిపిస్తాయి. అంతేకాదు 250 రకాల పక్షులు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా బర్డ్‌ వాచింగ్‌ చేసేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఎందరో ఉన్నారు.

PC: Praveen Kumar Chavan

3. గోకర్ణ:

3. గోకర్ణ:

'భూకైలాస క్షేత్రం' గా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. ఇది బెంగళూరు మహానగరానికి 550 కి. మీ ల దూరంలో, హుబ్లీ కి చేరువలో ఉంది. ఇదొక యాత్రా స్థలమే కాదు అందమైన సముద్ర తీర పట్టణం కూడా. గోకర్ణ రెండు అగ్నశిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో కలదు. ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని 'గోకర్ణ' అన్నారు. గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి చెందినది.గోకర్ణ బీచ్, పట్టణానికి సమీపంలో కలదు. బీచ్ కు ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పడమటి కనుమలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. స్థానిక హోటళ్లలో లభ్యమయ్యే రుచికరమైన ఆహారం, సన్ బాతింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఆనందించవచ్చు. ఇవన్నీ మీ సోలో ట్రిప్ బోర్ అనిపించకుండా చేస్తాయి.

4. హంపి:

4. హంపి:

సోలో ట్రావెలర్స్ కు హింపి ఒక ప్యారడైజ్ వంటిది.తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హంపి విజయనగర పాలన కాలంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందింది. ఆ సమయంలో ఇక్కడ అనేక అద్భుత దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలోని శిల్పకళ భారత శిల్పకళకు నిదర్శనం.రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్నవారికి ఈ చారిత్రాత్మక నగరం ఎప్పుడూ ఎర్ర తివాచిని పరుస్తూ ఉంటుంది. కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరు నుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది.పర్యాటకులకు ఈ పట్టణంలో చూడాలంటే 500 ప్రదేశాలకు పైగా ఉన్నాయి. వాటిలో సుమారు 100 ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ప్రతి ఏటా ఆకర్షిస్తున్నాయి. విఠల దేవాలయం వద్ద గల రాతి రధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూంటుంది. దీనినే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది.

5. కార్ వార్ :

5. కార్ వార్ :

రాష్ట్ర రాజధాని బెంగుళూరు నుండి 520 కిలో మీటర్ల దూరంలో సహజ అందాల కార్వార్ పట్టణం నెలకొని ఉంది. ఉత్తర కన్నడ జిల్లాకు ఇది ప్రధాన పట్టణంగా ఉంది.కాళి రివర్ కార్వార్ ప్రాంతంలోనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే సదాశివగౌడ కోట కూడా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో విహరించాలనుకునేవారికి ఇది మంచి ప్రదేశం. పర్యాటకులు ఈ బీచ్ లో సన్ బేతింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ మరియు నీటి ఆటలు ఆనందించవచ్చు.

కాళీ రివర్ వంతెన పక్క కట్టపబడింది. ఈ నది, బ్రిడ్జి, కోట, కన్నులకింపైన కొబ్బరి చెట్లు మొదలైన సుందర అందాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.కొబ్బరి చెట్లు, సరుగుడు చెట్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉండి పర్యాటకులకు స్వర్గాన్ని తలిపిస్తాయి. నీటి క్రీడలు స్విమ్మింగ్, స్నోర్ కెలింగ్, సర్ఫింగ్ డైవింగ్ వంటివి కార్వార్ బీచ్ లైన దేవ్ బాగ్, కూడి, కాజు బాగ్ లలో ప్రసిద్ధి దీనితో పర్యాటకులకు ఇది ఒక సాహస క్రీడల కేంద్రంగా తయారైంది.

6. ఉడిపి:

6. ఉడిపి:

సోలోగా వెళ్లేవారికి బీచ్ డెస్టినేషన్ ఇది. ఉడిపి చుట్టు ప్రక్కల ఫేమస్ బీచ్ లు, ఐస్ లాండ్స్, కుషన్స్, మరిని పర్యాటకులను ఆకర్షిస్తాయి. సోలో పర్యాటకులు వెకేషన్స్ ను రిలాక్స్ గా ఎంజాయ్ చేయదగ్గ ప్రదేశం ఇది. ఉడుపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడుపిలో ఉంది.ప్రకృతి అందాలకు కర్నాటక నెలవు అన్న విషయం తెలిసిందే. ఒక వైపున సముద్ర తీర ప్రాంతం ఉండగా మరోవైపున ఎతైన పచ్చటి పర్వత శిఖరాలు ఉన్నాయి. అయితే ఆ రెండు ప్రాంతాలు అంటే లోతైన సముద్రం, ఎతైన పర్వత శిఖరాలు ఒకే చోట ఉన్న ప్రాంతం ఉడిపి. ఈ ఉడిపికి దగ్గరగా ఉన్న మల్పె బీచ్, సెయింట్ ఐలాండ్, కౌప్, మరవంతే, బీచ్ లు విదేశీయులను సైతం ఆకర్షిస్తున్నాయి. అదే విధంగా పర్వత శిఖరాలు ట్రెక్కర్స్ కు స్వర్గధామం. ఇక పర్యావరణ ప్రేమికులకు ఉడిపికి దగ్గరగా ఉన్న పర్వతాలు, జలపాతాలు కనివిందును చేస్తున్నాయి.

PC: Ravi Mundkur

7. సకలేశ్‌పుర:

7. సకలేశ్‌పుర:

సకలేశ్ పుర మలనాడు పర్వతశ్రేణులు పశ్చిమ కనుమలలో భాగం. పశ్చిమ కనుమల్లో భాగమైన మలనాడు కొండలలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అమిత జంతు-వృక్ష సంపద ఉంది. ఈ జిల్లాలో అనేక కాఫీ తోటలు ఉన్నాయి. చుట్టుప్రక్కల కాఫీ, టీ మరియు మసాల దినుసుల తోటలతో చల్లని వాతవావరణంతో అందమైన ప్రదేశం. సమ్మర్ డెస్టినేషన్ గా ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకు అద్భుత ప్రదేశం. సకలేశ్‌పుర దగ్గరలో మంజరాబాద్ అనే ఒక టిప్పు సుల్తాన్ కట్టించిన కోట అద్భుతమనే చెప్పాలి. సోలో ట్రిప్పును మైమరపించే అద్భుత శిల్పసౌందర్యం.

PC: Ashwinstein

8. మడికేరి:

8. మడికేరి:

మడికేరి, కర్నాటక లోని కొడుగు జిల్లా లో గల అందమైన పట్టణం. ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ కూర్గ్ కు మడికేరి 41 కిలోమీటర్ల దూరంలో కలదు. దుబెరే ఎలిఫెంట్ క్యాంప్ సందర్శించవచ్చు. మడికేరి లో చూడవలసిన పర్యాటక అందాలు చాలానే ఉన్నాయి. ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది.

వీరి ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. వారు పలకరించే తీరు కూడా అక్కడి సంప్రదాయ కట్టుబాట్లకి తగ్గట్టు ఉంటాయి. పురుషులు చుట్టూ చుట్టుకొనే కుప్య అనే వస్త్రాలు ధరిస్తారు (ప్రస్తుతం పండుగలలో మాత్రమే ధరిస్తున్నారు). ఆడవారు ప్రత్యేకమైన శైలి లో చీర లను ధరిస్తారు. వీరికి కత్తులు పట్టుకోవటం, యుద్ధ విన్యాసాలతో కూడిన నృత్యాలు చేయటం అంటే మహా సరదా ! త్రాగటం, నృత్యాలు చేయటం మరియు మాంగోస్టీన్ తో కూడిన మాంసాహారాలు ఇక్కడి ప్రధాన వంటకాలు. కావేరి నది తీరాన అటవీ ప్రదేశం, ఏనుగుల ట్రైనింగ్ ప్రదేశాలు సోలో ట్రిప్ లో ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి.

PC: Ashwinstein

చిక్కమంగళూరు:

చిక్కమంగళూరు:

కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడ ప్రత్యేకత. కెమ్మనగుండి, కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు ప్రుక్రుతి రమణీయ ద్రుశ్యాలతో పర్యాటకులకు కనువిందు చేస్తాయి.ఈ శీతాకాలం, చిక్కమగళూర్ చుట్టు ప్రక్కల ప్రదేశాల ప్రకృతి అందాలను చూడగానే మైమరిచిపోతారు. ప్రశాంతమైన ఆధ్యాత్మికతతో నీలం కొండలు మరియు పచ్చని లోయల ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. చిక్క మగళూర్ లోని కలర్ ఫుల్ సీనరీస్ సంవత్సరం పొడవును మీకు గుర్తుండుపోయేలా చేస్తాయి. సెలవుదినాల్లో ప్రశాంతంగా గడపడానికి ఒక చక్కట ప్రదేశం ఇది. ప్రకృతి అందాలకు మాత్రమే కాదు చిక్ మంగళూరులో శారదాంబ టెంపుల్ మరియు ఇనామ్ దత్తాత్రేయ పీఠం వంటి మత స్థలాలకు చిక్కమగళూరు ప్రసిద్ది.

PC: Avinash kumar singh

బదామి:

బదామి:

చారిత్రాత్మకంగా వాటాపి అని పిలుస్తారు. చాళుక్యుల రాజధాని అయిన బదామీలో రెడ్ సాండ్ స్టోన్ ఏకశిలలో చెక్కిన రాక్ ఖట్ గుహలు మరియు దేవాలయాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ పట్టనంలో ప్రతి మూలలో ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సైట్ ఈ ప్రాంతంలోని అనేక త్రవ్వకాల ద్వారా పురాతన కాలం నాటి సంపదను వెలికితీస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

అగుంబె

అగుంబె

(పొగమంచుతో కూడిన అడవి అందాలు అగుంబెలో కనువిందు చేస్తాయి) ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశంలో చిరపుంజి అని పిలుస్తుంటారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రదేశంలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఈ మాన్‌సూన్‌ సీజన్‌లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. వాటర్‌ఫాల్స్‌ కనువిందు చేస్తాయి. కుంచికల్‌ ఫాల్స్‌, బర్‌కానా ఫాల్స్‌ అందాలు తనివితీరా చూడాల్సిందే. ఇక్కడున్న అగుంబె రెయిన్‌ఫారెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించి తీరాల్సిందే.

PC: Manu Gangadhar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X