Search
  • Follow NativePlanet
Share
» »అభానేరి-మెట్లబావుల ఊరు !!

అభానేరి-మెట్లబావుల ఊరు !!

మెట్ల బావిని చూశారా? ఎప్పుడో అమ్మమ్మ, తాతమ్మల నాటి బావులు కదా, ఇప్పుడెక్కడున్నాయి అనే సందేహం వస్తుందెవరికైనా. నిజమే ఇప్పుడు మామూలు బావులే లేవు, ఇక మెట్లబావి అనే మాటకు తావేలేదు. కానీ ఒక చోట మాత్రం చాలా పెద్దదైన మెట్ల బావిని చూడొచ్చు. ఆ ప్రదేశం జైపూర్‌ కి 95 కిలోమీటర్ల దూరంలోని అభానేరి గ్రామం. ఈ మెట బావి పేరు 'చాంద్‌ బవోరి'. దీన్ని ఎనిమిదో శతాబ్దంలో నిర్మించారు. మన దేశంలో ఇదే అతిపెద్ద మెట్ల బావి. వంద మీటర్ల లోతులో, 3500 ఇరుకైన మెట్లతో ఉంది. ఆనాటి నిర్మాణ శైలికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

జైపూర్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చాంద్ బవోరి

చాంద్ బవోరి

మీరెప్పుడైన 13 అంతస్తుల బావిని చూశారా??మీరు విన్నది నిజంగా బావేనండి!!.. బిల్డింగ్ కాదు. చాంద్ బవోరి రాజస్ధాన్ లోని అభనేరిలో కలదు. ఇండియాలోని దిగుడు బావులలో కెల్లా అందమైన బావి ఇది. ఈ మెట్ల బావిని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతపు రాజు రాజా చంద్ నిర్మించారు. ఈ మెట్లబావులు పురాతన కాలంలో వర్షాల నీటితో నిండి, నీరు అవసరమైన వేసవి కాలంలో వాడుకునేందుకు రిజర్వాయర్లుగా ఉపయోగపడేవి.
నలుచదరంగా నిర్మించిన ఈ మెట్ల బావి లోతు సుమారు 100 అడుగుల లోతు ఉంటుంది.. దీనికి ఇరుకైన 3,500 మెట్లు 13 అంతస్తులలో నిర్మించారు. ఈ బావికి మూడు వైపులనుండి మెట్లు కలవు. నాలుగవ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు. ఇక్కడే ఒక స్టేజి మరియు కొన్ని గదులు కూడా కలదు. దీనిలో రాజు మరియు రాణి తమ కళలను ప్రదర్శించేవారు. చాంద్ బవోరిని ప్రస్తుతం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటుంవంటి ప్రవేశ రుసుము లేదు. ఈ ప్రదేశాన్ని కొన్ని సినిమాలలో అంటే "ది ఫాల్" మరియు "ది డార్క్ నైట్ రైసెస్" వంటి చిత్రాల షూటింగ్ లలో వాడారు.

Photo Courtesy: Arnie Papp

హర్షత్ మాత దేవాలయం

హర్షత్ మాత దేవాలయం

రాజస్ధాన్ లోని అభనేరి గ్రామంలోని చాంద్ బవోరి ఎదురుగా హర్షత్ మాత దేవాలయం కలదు. ఈ దేవాలయాన్ని 8వ లేదా 9వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం మాత హర్షత్ మాత దేవత కొరకు నిర్మించారు. ఈమె సంతోష ఆనందాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. భక్తులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి ఎడతెగని సంతోషానందాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం హర్షత్ మాత దేవాలయంలో మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పొరుగు గ్రామాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. చక్కని శిల్పకళకు ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం ఇపుడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నిర్వహణలో కలదు.

Photo Courtesy: Ajay Parikh 103

జానపద నృత్యాల గ్రామం

జానపద నృత్యాల గ్రామం

అభనేరి గ్రామం జానపదుల నృత్యాలకు ప్రసిద్ధి గాంచింది. ఘూమర్, కలబెలియా, భవాయ్, వంటివి ప్రసిద్ధి చెందిన నాట్యాలు. ఘూమర్ డ్యాన్స్ ను భిల్ తెగ వారు కలబెలియా డ్యాన్సును పాములు పట్టి వాటి విషాలను విక్రయించే కలబెలియా తెగలోని మహిళలు, చేస్తారు. భవాయ్ డ్యాన్స్ ను అంబామాత లేదా భూ దేవి కొరకు ఒక మతపర వేడుకగా చేస్తారు.

Photo Courtesy: Bipin Gupta

అభనేరి సందర్శనకు ఉత్తమ సమయం

అభనేరి సందర్శనకు ఉత్తమ సమయం

అభనేరి సందర్శనకు అక్టోబర్ నుండి ఏప్రెల్ మధ్య వరకు వాతావరణం ఆహ్లాదంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఒకవేళ మే నెలలో వెళితే ఇక అంతే సంగతులు!!. ఒకవేళ వెళితే సరైన జాగ్రత్తలు తీసుకొనిపోండి!!

Photo Courtesy: Ramón

భోజన ప్రియులకొరకై

భోజన ప్రియులకొరకై

అభనేరిలో రకరకాలైన భోజనాలు దొరుకుతాయి. ఇక్కడ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లితో చేసిన రుచికరమైన కారపు వంటకాలకు ప్రసిద్ది చెందింది. దాల్ బాటి - చూర్మా, ఉల్లి కచోరి, కబాబ్, ముర్గు కో ఖాటో, అచారి ముర్గు లు ప్రసిద్ధ వంటకాలలో కొన్ని.

Photo Courtesy: Ramón

ఎలా వెళ్ళాలి??

ఎలా వెళ్ళాలి??

విమాన మార్గం
అభనేరికి దగ్గరలో ఉన్న ఏర్‌పోర్ట్ సంగానేర్. ఇది రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ లో ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని నగరాలకి వైమాన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏర్‌పోర్ట్ నుంచి 82 కి. మీ. దూరంలో అభనేరి ఉన్నది.
రైలు మార్గం
అభనేరికి దగ్గరలో మెర్టా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి కేవలం 2 కి. మీ. దూరంలో ఈ ప్రాంతం ఉంది. రైలు ప్రయాణం చవకైనది కనుక మీరు రైలు మార్గం ద్వారా వస్తే బాగుంటుంది.
బస్సు మార్గం
జైపూర్-ఆగ్రా హైవే నం. 11 మీద , జైపూర్ కి సుమారుగా 95 కి. మీ. దూరంలో ఉన్నది. జైపూర్ బస్‌స్టాండ్ నుంచి బస్సులు ఇక్కడికి తిరుగుతనే ఉంటాయి.

Photo Courtesy: LRBurdak

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X