• Follow NativePlanet
Share
» »రెండు రోజుల్లో అక్కడి అందాలను ఆస్వాధించి రావచ్చు.

రెండు రోజుల్లో అక్కడి అందాలను ఆస్వాధించి రావచ్చు.

Written By: Kishore

వేసవి కాలం. సెలవుల కాలం. ఇట్లో పిల్లలకు సెలవులు ఇచ్చేశారు. వారేమో సెలవులకు టూర్ వెలుదాం అంటూ గోల గోల చేస్తుంటారు. పెద్దవారికేమో శని, ఆదివారాలు మాత్రమే సెలవులు దొరుకుతాయి. కేవలం రెండు రోజులు మాత్రమే సెలవులు ఉంటే ఎక్కడికి వెళ్లాలి. టూర్ ను ఎంజాయ్ చేస్తామా? వెళ్లడానికే సమయం సరిపోతుంది. ఇలా అనేక ప్రశ్నలు మదిని తొలిచివేస్తాయి. అయితే సరైన ప్రణాళిక ఉంటే కేవలం రెండు రోజుల్లోనే మనకు దగ్గరగా ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఎంచక్కా ఎంజాయ్ చేసి రావచ్చు. ఉదాహరణకు బెంగళూరును తీసుకొందాం. ఈ నగరానికి దగ్గరగా అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడికి ఎలా వెళ్లాలి? ఏమేమి చూడాలి? ఉన్న రెండు రోజుల సెలవులను ఎలా గడపాలి అన్న విషయాలు మీ కోసం ఈ కథనంలో...

ఐటీ నగరిలోనూ ఆధ్యాత్మిక గుభాళింపులు

1. హంపి

1. హంపి

Image Source:

బెంగళూరు నుంచి హంపికి 367 కిలోమీటర్లు. హంపి ప్రముఖ ధార్మిక కేంద్రం ఇక్కడ విరూపాక్షస్వామి దేవాలయం మొదలుకొని ఎన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. అంతే కాకుండా హంపికి దగ్గరగా అనేక రాక్ క్లైంబింగ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. సాహస క్రీడలను ఇష్టపడే వారికి ఈ ప్రాంతాలు బాగా నచ్చుతాయి. హంపిలో కొత్తగా సైకిల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. సైకిళ్లను అద్దకు తీసుకుని మనం చూడాల్సిన ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. అంతే కాకుండా విర్చువల్ గైడ్ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల మనం గైడ్ సహాయం లేకుండానే మనం హంపి ఏదేని దేవాలయం, ప్రదేశానికి వెళ్లిన అక్కడి వివరాలన్నీ మనకు ఇట్టే తెలిసిపోతాయి.

ఎలా వెళ్లాలి..
చిత్రదుర్గ హెన్ హెచ్ 4 హైవే మీదుగా మొదట హొసపేట చేరుకొని అక్కడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపిని చేరుకోవచ్చు.

2.ఊటి

2.ఊటి

Image Source:

బెంగళూరు నుంచి 266 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. బెంగళూరుతో పాటు మైసూరు ప్రజలు ఇక్కడకు వారాంతాల్లో ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ బొటానికల్ గార్డెన్, జింకల పార్క్, మ్యూజియం తదితర ప్రాంతాలన్నీ చూడదగినవి. ఇక ఇక్కడి చల్లని వాతావరణం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.

ఎలా వెళ్లాలి

బెంగళూరు నుంచి మొదట మైసూరుకు వెళ్లి అక్కడి నుంచి ఊటికి వెళ్లవచ్చు. అదే విధంగా చామరాజనగర నుంచి కూడా ఊటికి వెళ్లవచ్చు.

3. పాండిచ్చేరి

3. పాండిచ్చేరి

Image Source:

వేసవి కాలంలో బీచ్ టూరిజాన్ని ఇష్టపడే వారికి పాండిచ్చేరి ఉత్తమమైన పర్యాటక కేంద్రం. ఇక్కడ స్కూబా డైవింగ్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. పెద్దలకు మాత్రమే ఈ అవకాశం. ఇది అత్యంత శాంతియుతమైన ప్రాంతం. ఇక్కడకు దగ్గర్లోనే అరవింద్ ఆశ్రామం కూడా ఉంది.

ఎలా వెళ్లాలి

మన దగ్గర ఉన్నది కేవలం రెండు రోజులే కాబట్టి బెంగళూరు నుంచి సొంత వాహనం లేదా ట్యాక్సీ ద్వారా పాండిచ్చేరి వెళ్లడం మంచిది.

4. మంగళూరు

4. మంగళూరు

Image Source:

బెంగళూరు నుంచి మంగళూరుకు 355 కిలోమీటర్ల దూరం. ఇక్కడి బీచ్ లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఈ బీచ్ ల అందాలను చూడాల్సిందే కాని వర్ణించడానికి వీలుకాదు. మంగళూరులో ట్రెక్కింగ్ కు కూడా అవకాశం కలిగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సీ ఫుడ్ చాలా బాగుంటుంది.

ఎలా వెళ్లాలి
బెంగళూరు నుంచి మంగళూరుకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. శుక్రవారం రాత్రి బెంగళూరులో బయలు దేరడం మంచిది.

5. కబిని

5. కబిని

Image Source:

బెంగళూరు నుంచి కబినికి 200 కిలోమీటర్ల దూరం. ప్రక`తి సౌదర్యాన్ని ఇష్టపడే వారికి కబిని బాగా నచ్చుతుంది. ఇక్కడి బ్యాక్ వాటర్ లో బోటులో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అదేవిధంగా కబిని కర్నాటకలో ప్రముఖ అభయారణ్యం కూడా.

ఎలా వెళ్లాలి

కబినికి బెంగళూరు, మైసూరు నుంచి నేరుగా బస్సు సర్వీసులు ఉన్నాయి. లేదా బెంగళూరు నుంచి సొంత వాహనాల్లో వెళ్లడం మంచిది.

6. బండీపుర

6. బండీపుర

Image Source:

బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో బండిపుర ఉంది. ఇది అభయారణ్యం. ఇక్కడ సఫారీకి కూడా అవకాశం ఉంది. సహజ ఆవాసాల మధ్య తిరుగాడే జంతువులను చూడటం ఇష్టపడే వారికి బండీపుర బాగా నచ్చుతుంది.

ఎలా వెళ్లాలి

బండీపురు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఉత్తమమైనది బెంగళూరు, మైసూరు, మద్దూరు, నంజనగూడ్, బేగూర్, గుండ్లుపేట్. బెంగళూరు నుంచి సొంత వాహనాల్లో వెళ్లడం మంచిది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి