Search
  • Follow NativePlanet
Share
» »అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని త‌ప్ప‌కుండా గుర్తు చేసుకోవాలి

అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని త‌ప్ప‌కుండా గుర్తు చేసుకోవాలి

అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని త‌ప్ప‌కుండా గుర్తు చేసుకోవాలి

ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుకొంటారు. అందుకే, ఈ ప్రత్యేక దినం సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ల గురించి ఒక్క‌సారి గుర్తుచేసుకుందాం. ప్ర‌కృతితో మ‌మేక‌మ‌య్యే ఈ ప‌ర్వ‌త ప్రాంతాల‌ను ప‌రిర‌క్షించ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు. అంతేకాదు, ఇక్కడ మీరు శీతాకాలపు సెలవులను కుటుంబ‌స‌మేతంగా ఆస్వాదించవచ్చు.

దేశంలో అరుదైన‌, అంద‌మైన ప‌ర్వ‌త శ్రేణులు చాలానే ఉన్నాయి. అయితే, ఈ సీజ‌న్‌లో మాత్రం ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు రెట్టింపు అవుతాయి. పూర్తిగా మంచుతో కప్పబడిన లోయలు మరియు పర్వతాల సుంద‌ర‌ దృశ్యాన్ని చూడవచ్చు. ఈ అందం మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఆ అందమైన హిల్ స్టేషన్‌ల గురించి తెలుసుకుందాం.

ఔలి

ఔలి

ఔలి ఉత్తరాఖండ్‌లో ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్. శీతాకాలం వ‌చ్చిందంటే, మ‌న దేశంలోని వారే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్క‌డ‌కి సంద‌ర్శ‌కులు వ‌స్తూ ఉంటారు. అలా వ‌చ్చే పర్యాటకులు ప్రకృతి ప్ర‌సాదించిన‌ అద్భుతమైన దృశ్యాలను మ‌న‌సారా ఆస్వాదిస్తూ..

ఆనందంగా గ‌డుపుతారు. ఇక్కడ కేబుల్ కార్ రైడ్ చాలా ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు ఇందులో కూర్చుని ఔలి యొక్క అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తారు. ఈ ప్రయాణం 15-20 నిమిషాలు పడుతుంది. చలికాలంలో విహారయాత్ర‌కు ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ హిల్ స్టేషన్‌ని సందర్శించండి.

గుల్మార్గ్

గుల్మార్గ్

దేశంలోని అందమైన హిల్ స్టేషన్‌ల‌లో జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ కూడా చేర్చబడింది. దీనిని భూమిపై ఉన్న స్వర్గంగా పిలుస్తారు. చలికాలంలో ఇక్క‌డ కురిసే భారీ మంచును ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువ‌గా వస్తుంటారు. మీరు ట్రెక్కింగ్, గోల్ఫ్‌తో సహా అనేక ఆహ్లాదకరమైన క్రీడలను కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్క‌డి ట్రెక్కింగ్ మార్గ‌లు ఎంతో అద్భుతంగా మ‌ల‌చ‌బ‌డ్డాయి. ఈ క్రీడ గుల్మార్గ్‌లో సాహ‌సంతో కూడుకున్న‌దిగా చెప్పొచ్చు.

గాంగ్‌టక్

గాంగ్‌టక్

గాంగ్‌టక్ సిక్కిం రాష్ట్రంలో అతిపెద్ద నగరం. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, హైకింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ మొదలైనవాటిని ఆనందించవచ్చు. శీతాకాలంలో గాంగ్‌టక్ అందాలు రెట్టింపు అవుతాయి. ఏటా ఇక్క‌డ అనేక ర‌కాల సాహ‌స‌క్రీడ‌లు జ‌రుపుతూ ఉంటారు. ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో ఉన్న బాన్ ఝక్రి, త్సోమో లేక్, తాషి మొదలైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను కూడా సందర్శించవచ్చు.

చైల్

చైల్

చైల్ హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న హిల్ స్టేషన్. ప్రశాంతమైన ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే, మీరు ఈ హిల్ స్టేషన్‌ని సందర్శించవచ్చు. ఇక్కడ పర్వతాల అందాలను ఆస్వాదించవచ్చు. దాని సహజ సౌందర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. చైల్‌లో జన సంచారం చాలా త‌క్కువ‌. ఇక్క‌డ విడిది చేసేందుకు ప్ర‌త్యేక చెక్క‌తో త‌యారు చేసిన కాటేజీలు సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి.

డెహ్రాడూన్

డెహ్రాడూన్

ఇది ఉత్తరాఖండ్ రాజధాని. గంగా-యమునా నదులతో చుట్టుముట్టబడిన ఈ హిల్ స్టేషన్‌ను డూన్ వ్యాలీ అని కూడా అంటారు. డెహ్రాడూన్‌లో సందర్శించడానికి ఎక్కువ గొప్ప ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు లాచీవాలా, తప్కేశ్వర్ ఆలయం, సహస్త్రధార, రాజాజీ నేషనల్ పార్క్ మొదలైన వాటిని సందర్శించవచ్చు. శీతాకాలపు సెలవులను ఎంజాయ్ చేసేందుకు డెహ్రాడూన్ స‌రైన ఎంపిక‌.

Read more about: auli uttarakhand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X