Search
  • Follow NativePlanet
Share
» »దైవభక్తి కంటే వింత, భయంకర ఆచారాలకు నిలయమైన ఆలయాలు

దైవభక్తి కంటే వింత, భయంకర ఆచారాలకు నిలయమైన ఆలయాలు

మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు చూస్తే ఆశ్చర్యం మాత్రమే కాదు, భయం కూడా కలుగుతుంది. అక్కడ జరిగే తంతుల గురించి వింటే జన్మలో ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు అనుకుంటారు. అలాకాదని, సరదాపడి వెళ్ళివచ్చిన వారు బ్రతికి బ

ఆధ్యాత్మకతకు, మనశ్శాంతికి ఆనవాలు మన ఆలయాలు సకల జనులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అమిత భక్తి భావాన్ని నూతన ఉత్తేజాన్ని పొందుతారని మనందరికీ తెలుసు. దేవాలయాల్లో జరిగే పూజలు, కార్యక్రమాలు, మన హిందూ దర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మన సాంప్రదాయకం యొక్క విలువలను తెలియజేస్తాయి. కానీ మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు చూస్తే ఆశ్చర్యం మాత్రమే కాదు, భయం కూడా కలుగుతుంది.

అక్కడ జరిగే తంతుల గురించి వింటే జన్మలో ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు అనుకుంటారు. అలాకాదని, సరదాపడి వెళ్ళివచ్చిన వారు బ్రతికి బయటపడినందుకు ఆ దేవుడికి కోటి దండాలు పెడతారు. ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో అటువంటి వింత ఆచారాలను, భయంకరమైన పద్దతులను పాటిస్తున్నారు. అలాంటి ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం కలగడం ఖాయం. మరి ఆ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటి రహస్యాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. కాలభైరవుడి దేవాలయం:

1. కాలభైరవుడి దేవాలయం:

శివుని అంశగా వెలసిన రౌద్రనాథుడు కాలకేయుడు, శివశక్తి, శివుని మరో రూపంగా శివగణాలలో అత్యంత శక్తిమంతుడుగా పేరుగాంచిన కాలకేయుడిని యుగయుగాలుగా అమిత భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు.మరి ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు శివుడి కోసం నారికేళ్ళను తీసుకెళ్ళడం అనాది కాలం నుండి సంప్రదాయంగా వస్తోంది. అయితే ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని ఆలయానికి వెళితే మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆలయంలో దేవుడికి ఆల్కహాల్ ను నైవేద్యంగా, ప్రసాదంగా అందివ్వడం అక్కడ ప్రజల ఆచారం. భక్తుల తెచ్చే ఆల్కహాల్ ను నేరుగా స్వామి వారి నోట్లో పోయడం జరుగుతుంది. పోసిన తక్షణం ఆల్కహాల్ మాయం అవ్వడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకు తగినట్లుగానే ఆలయం వెలుపల పూలు, పండ్లు కొబ్బరికాయలకు బదులుగా ఆల్కహాల్ దుఖానాలను మీరు గమనించవచ్చు.


P.C. YOU TUBE

2. మాలా మల్లేశ్వర దేవాలయం:

2. మాలా మల్లేశ్వర దేవాలయం:

మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వింత ఆచారం ఉన్న ఆలయం ఉన్నది. సాధారణ రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం పుణ్యదినమైన దసరా రోజున మాత్రం ఆలయ ప్రాంగణం అత్యంత భయానకంగా మారిపోతుంది, ఆ ఆలయమే కర్నూలు జిల్లాలోని హోలగుండ మండలంలో దేవరగట్టు గ్రామంలో వెలసిన మాలమల్లేశ్వరస్వామి ఆలయం. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు, దసరా రోజు సాయంత్రానికల్లా దేవాలయాన్ని చేరుతారు. వేల సంఖ్యల్లో ప్రజలు అక్కడికి చేరడాన్ని చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే అందుకు ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. దసరా రోజు వింత ఆచారాన్ని ఇక్కడ పాటిస్తున్నారు. పెద్ద కర్రలతో ఒకరినొకరు తలలు బద్దలు కొట్టుకోవడం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దీనిని బన్నీవోత్సవంగా పిలుస్తారు. అర్థరాత్రి వరకు జరిగే ఈ ఉత్సవం వల్ల రక్తం ఏరులై పారుతుంది. ఈ వింత ఆచారం సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నయంటున్నారు.


P.C. YOU TUBE

3. దెవ్జి మహారాజ్ మందిర్:

3. దెవ్జి మహారాజ్ మందిర్:

మద్యప్రదేశ్ లోని మలజ్ పూర్ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని దెవ్జి మహారాజ్ మందిర్ గా అక్కడి ప్రజలు పిలుస్తారు.ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవం కథ ఏంటో కానీ, ఈ ఉత్సవాన్ని చూసిన వారికి మాత్రం చలి జ్వరం రావాల్సిందే, అంత భయంకరమైన వింత ఆచారం అక్కడి ప్రజల్లో ఉండటం ఒక్కింత ఆశ్చర్యమే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు, ఆడమగా బేదం లేకుండా వారిలో దెయ్యం ఉన్నట్లు తమకు తాము ఊహించుకుని, చేతుల్లో కర్పురాన్ని వెలిగించుకుని ఊరంతా తిరుగుతారు. ఇలా చేయడం వల్ల తమలో మరియు తమ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతే కాదు సంవత్సరానికొకసారి భూత్ మేళ అనే ఉత్సవం పేరుతో గుడి ముందు పెద్ద మంట వేస్తారు. దాంతో చుట్టు పక్కల ఉన్న దుష్టశక్తులు ఆ మంటల్లో చేరి చనిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.


P.C. YOU TUBE

4. కాళీమాత విశ్వరూప ఆలయం:

4. కాళీమాత విశ్వరూప ఆలయం:

మరో వింత ఆచారం కేరళలోని త్రిసూర్ జిల్లాల్లోని కుడుంగళ్లూర్ అనే ఊరిలో కాళీమాత విశ్వరూపంగా భావించే అమ్మ అనే దేవతా మూర్తి విశ్వరూపంను ఆరాధిస్తారు. మామూలు సమయంలో సాధారణంగా కనిపించే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏడు రోజుల పాటు ఇక్కడ జరిగే భరణి ఉత్సవాలు చూసిన వారికి ఒళ్ళు గగుర్పొడచడం ఖాయం. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆడమగ తేడాలేకుండా అందరూ ఒంటికి కుంకు రాసుకుని, చేతులలో కత్తులు పట్టుకుని, రక్తం చిందేలా తమను తాము కొట్టుకుంటూ భూతులు తిట్టుకుంటూ ఊరంతా ఊరేగుతూ చివరగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు.
PC- Sujithvv

5. మహందిపుర్ బాలాజీ టెంపుల్ :

5. మహందిపుర్ బాలాజీ టెంపుల్ :

ఈ ఆలయాన్ని ఆంజనేయునికి అంకితమివ్వబడినది. రాజస్తాన్ లోని దౌసల్ జిల్లాలోని మెహందిపూర్ అనే ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని బాలాజీగా కొలుస్తారు. అయితే ఈ ఆలయం వాతావరణం మాత్రం అన్ని హనుమంతుని ఆలయాల్లా ప్రశాంతంగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఇక్కడకి వచ్చే భక్తులు సాధారణమైనవారు, దెయ్యం పట్టిన వారు మాత్రమే వస్తారు. ఈ ఆలయంలో పూజారులు దెయ్యం పట్టిన వారికి దెయ్యం వదిలిస్తారట. ఇక్కడికి వచ్చే వారు పెద్దపెద్దగా అరవడం తమను తామను భయంకరంగా హించుకోవడం, తలను గోడకు కొట్టుకోవడం చేస్తుంటారు. ఇవన్నీ చూసేవారికి వింతగా అనిపించినా అక్కడి వారికి మాత్రం ఇది ఒక గట్టి నమ్మకం ఒంట్లో ఉన్న దెయ్యాలను తరమగొట్టడంలో ఈ ఆలయం ప్రసిద్ది చెందినది.

PC: wikipedia.org

6. ఇంటింటికి ఒక పాముల పుట్టు:

6. ఇంటింటికి ఒక పాముల పుట్టు:

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని షెట్పాల్ గ్రామంలో ఉన్న ప్రజలు పాములను ఆరాధించడంలో ప్రసిద్ధి చెందినారు. ఈ విషయం మనకు భయానకం కలిగించేదే అయినా ఈ గ్రామంలో ఒక వింత ఆచారం. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి పైకప్పుల తెప్పలలో కోబ్రాస్ కోసం విశ్రాంతి స్థలం ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటిలో పాముల తిరుగుతున్నప్పటికీ, ఏ ఒక్కరికీ పాము కరిచినట్లు మాత్రం దాకలాలు లేవు.

Photo Courtesy: Vaikoovery

7. స్థంబేశ్వర టెంపుల్:

7. స్థంబేశ్వర టెంపుల్:

రోజులో కనిపించి, కనబడని దేవాలయం? ఈ ఆలయాన్ని గుజరాత్ లోని వందోదర సమీపంలో ఉంది. ఈ ఆలయం అరేబియ సముద్ర తీరానా ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. దైర్యం చేసి ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు ఆ పరమేశ్వరుని ఆశిస్సులు తప్పక లభిస్తాయని భక్తుల నమ్మకం. మన ఇండియాలో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయం ఇది. అయితే ఈ ఆలయం గురించి ఒక వింత విషయమేమిటంటే సముద్రపు అలలు తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే లోపలికి ప్రవేశించాలి. మిగిలిన సమయాల్లో సముద్రపు నీటితో ఆలయం పూర్తిగా నీటి మునిగి ఉంటుంది. తర్వాత మళ్లీ కొన్ని గంటల తర్వాత కనబడుతుంది.

P.C. YOU TUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X