Search
  • Follow NativePlanet
Share
» » బెంగుళూరు నుండి కోచి విమానంలో....!

బెంగుళూరు నుండి కోచి విమానంలో....!

నేటి రోజుల్లో ప్రయాణ టికెట్ ఎక్కడ చూసినా అధికంగా వుంది. అయితే, బెంగుళూరు నుండి కేరళ లోని కోచి కి విమాన ప్రయాణం టికెట్ ధర అక్షరాలా అయిదు వందల రూపాయలు మాత్రమే అంటే..నమ్ముతారా ? నమ్మాల్సిందే...ఎలాగో చూడండి. ఎయిర్ ఆసియా ఇండియా విమాన సంస్థ బెంగుళూరు నుండి కోచి కి వచ్చే నెలలో రూ.500 టికెట్ ధర లిమిటెడ్ ఆఫర్ ఇస్తూ అందరినే ఆశ్చర్య పరచింది.

కేరళ నృత్యాలు ఒక ప్రత్యేకత

ఈ విమాన సంస్థ బెంగుళూరు - గోవా ల మధ్య ఈ నెల 12 న దాని మొదటి విమానం నడిపింది. అదే సమయంలో జూలై 20 నుండి బెంగుళూరు నుండి కోచి కి విమాన సేవలు కూడా అందిస్తున్నానని తెలిపింది.

ఎయిర్ ఆసియా ఇండియా సి ఇ ఓ కధనం మేరకు ఈ సంస్థ దాని మూడవ ప్రదేశ సేవలు కూడా విస్లేశించినదనీ, చాలావరకు మొదటి సారి విమాన ప్రయాణం చేసే వారికి అధికంగా సహకరిస్తామని తెలిపింది. కస్టమర్ ల సొమ్ము కు తగిన నాణ్యత సేవలు అందించేందుకు వాగ్దానం చేసింది.

అబ్బుర పరచే కధాకళీ

ఈ నెల 19 నుండి బెంగుళూరు చెన్నై ఫ్లైట్ లు కూడా నడుపనుంది. బెంగుళూరు నుండి గోవా కు ప్రస్తుతం విమాన సేవలు అందిస్తోంది. తమ పోటీ దారులైన ఇండిగో స్పైస్ జెట్, గో ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మరియు జెట్ లైట్ వంటి కంపెనీ లు ప్రస్తుతం నిర్వహించే మార్కెట్ ధరలలో 35 శాతం తక్కువ ధరలకు టయర్ - 2 నగరాల ప్రయాణానికి తాము సిద్ధం అవుతున్నట్లు తెలిపింది.

సెలవుల సందడి ...ఎక్కడికెళ్ళాలి?

ఆఫర్ ముగిసే ముందు త్వరగా మీ టికెట్ లు బుక్ చేసే చారిత్రాత్మక నగరం కోచి అందాలు తప్పక చూడండి. ఒకప్పుడు వ్యాపారాల కోసం ఇక్కడకు వచ్చి న పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్ మరియు అరబ్బులు అందరూ తిరిగిన ఈ ప్రదేశ సాంస్కృతిక వైభవం చూసి ఆనందించండి.

మీకు మరింత సహకరించేందుకు కోచి లో హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి.

కోచి ఆకర్షణలు

కోచి ఆకర్షణలు

కోచి పట్టణాన్ని ప్రతి ఒక్కరూ జీవితం లో ఒక్కసారైనా చూసి ఆనందించాలి. ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. ఎన్నో మ్యూజియం లు, టెంపుల్స్, పిల్లల పార్క్ లు, షాపింగ్ మాల్స్ కలవు. సాన్క్చురి లు, వైల్డ్ లైఫ్ పార్క్ లు, వివిధ రకాల అరుదైన వృక్ష, జంతు సంపద కలదు.

Photo Courtesy: Connie Ma

కోచి హోటళ్ళు

కోచి హోటళ్ళు

కోచి హోటళ్ళు బాగా ప్రసిద్ధి చెందినవి. ఈ పట్టణంలో వివిధ జాతుల, సంస్కృతుల వారు వుండటం వలన ఇక్కడి ఆహార అలవాట్లు కూడా వేరుగా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వంటకాలు ఇక్కడ మీరు రుచి చూస్తారు. కొచ్చి హోటళ్లకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోర్ట్ కోచి

ఫోర్ట్ కోచి

ప్రధానం గా ఇది ఒక మత్స్యకారుల గ్రామం. ఇపుడు ఒక ప్రధాన పర్యాటక కేంద్రం అయింది. పర్యాటకులకు ఇక్కడ కల బీచ్ అద్భుత ఆనందాలు ఇస్తుంది. పట్టణం గత కాల వైభవాల భవనాలతో కన్నుల విందు చేస్తుంది. కోచి పట్టణంలో మీరు చూడవలసిన అనేక ఆకర్షణలు కలవు.

Photo Courtesy: Chandika Nair

కోచి నుండి కోవలం

కోచి నుండి కోవలం

కోచి నుండి కోవలంకు రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. మార్గంలో అల్లెప్పీ , వర్కాల మరియు తిరువనంతపురంలు కూడా చూడవచ్చు. ఈ రోడ్డు ప్రయాణం మీకు మరింత తాజా అనుభూతులు పంచుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X