» »బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా?

బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను 'బ్రహ్మంగారి కొండలు' అని కూడా పిలుస్తారు.

బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫెమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా భాద్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు అయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది ? అక్కడికి వెళ్లగలమా ? లేదా ? ఇప్పుడు మనం తెలుసుకుందాం !!

బనగానపల్లె

బనగానపల్లె

తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లె చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయటంతో బాగా అలిసిపోయిన స్వామి వారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటిది.

PC : indian railinfo

కాపరిగా ..

కాపరిగా ..

ఉదయాన్నే అచ్చమ్మ, తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి, ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, తనకేదైనా పనప్పజెప్పమని కోరగా ... తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ.

చిత్రకృప : Raghuramacharya

రవ్వలకొండ

రవ్వలకొండ

అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజూ రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం వ్రాయాలని నిశ్చయించుకొన్నారు. అక్కడే ఒక తాటిచెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెబుతారు.

గీత

గీత

తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏంకాను? అని గ్రహించిన బ్రహ్మగారు ... వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేతమేసేవి.

రవ్వలకొండ

రవ్వలకొండ

ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంత మంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు (కొందరు అచ్చమ్మనే అయన పనిని గ్రహించటానికి వెళ్ళింది అంటారు). అచ్చమ్మ కొండ పైకి వెళ్ళి చూస్తే పశువులు ఏకాగ్రతతో మేత మేయటం గ్రహించింది.

కాలజ్ఞానం వ్రాస్తూ

కాలజ్ఞానం వ్రాస్తూ

గుహలో వెళ్ళి చూస్తే, బ్రహ్మంగారు ధ్యాన ముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం వ్రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించింది. తానూ ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా ?? అని బాధపడిన అచ్చమ్మ, స్వామిని క్షమించమని వేడుకుంది. తనకు జ్ఞాన బోధ చేయమని కోరింది.

కాలజ్ఞానం పాతిపెట్టారు

కాలజ్ఞానం పాతిపెట్టారు

పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.

జవాబు దొరకలేదు

జవాబు దొరకలేదు

ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు.

బనగానపల్లె చింతచెట్టు

బనగానపల్లె చింతచెట్టు

అచ్చమ్మ ఇంట్లో యధాప్రకారం కాలజ్ఞానాన్ని వ్రాసి, ఒక చోట పాతిపెడుతూ ఉండేవారు పోతులూరి. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింతచెట్టు ను నాటారు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదం, ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.

చిత్రకృప : LRBurdak

గరిమిరెడ్ది అచ్చమాంబ

గరిమిరెడ్ది అచ్చమాంబ

ఇల్లు బ్రహ్మం గారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు. ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఇంటిని మ్యూజియంగా మార్చారు.

గరిమిరెడ్ది అచ్చమాంబ

గరిమిరెడ్ది అచ్చమాంబ

ఇల్లు బ్రహ్మం గారి జీవితానికి సంబందించిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మం గారు ఇక్కడ నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి, అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు.

రవ్వలకొండ

రవ్వలకొండ

రవ్వలకొండ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ చెట్టు కిందే ఆవులను కట్టేవారు.

రవ్వలకొండ

రవ్వలకొండ

రవ్వలకొండ వద్ద ఎండిపోయిన బావి.దీనిని విగ్రహం పక్కన బయటివైపు చూడవచ్చు.

రవ్వలకొండ

రవ్వలకొండ

బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహకి దారి. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం (ఆనందాశ్రమం).

రవ్వలకొండ

రవ్వలకొండ

గుహకి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఖరీదు 2 రూ.

రవ్వలకొండ

రవ్వలకొండ

ఈ గుంట స్వామి వారు స్నానం చేయటానికి వాడినది.

గుహలో వివిధ ప్రాంతాలకు వెళ్ళవచ్చు

గుహలో వివిధ ప్రాంతాలకు వెళ్ళవచ్చు

గుహలోనుంచి శ్రీశైలం, మహనంది, యాగంటి వెళ్ళటానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడి స్వామి వారు ఆ ప్రాంతాలకి వెళ్ళేవారు.

స్వామివారిని చూసిన ప్రదేశం

స్వామివారిని చూసిన ప్రదేశం

ఇక్కడ నుంచే అచ్చమాంబగారు స్వామివారు కాలజ్ఞానం రాయటం చూశారు.

ముచ్చట్ల గుట్ట

ముచ్చట్ల గుట్ట

బ్రహ్మంగారు ఎందరికో వివిధ సందర్భాలలో జ్ఞాన బోధ చేశారు. వారిలో అచ్చమ్మ, బనగానపల్లె నవాబు, హైదరాబాద్ నవాబు ముఖ్యలు. నవాబులకు వారి దివానాల్లో, అచ్చమాంబకు యాగంటి క్షేత్రంలోని ముచ్చట్ల గుట్ట వద్ద జ్ఞానబోధ చేశారు.

pc:Ashwin Kumar

బనగానపల్లె లో చూడవలసినఇతర ఆకర్షణలు

బనగానపల్లె లో చూడవలసినఇతర ఆకర్షణలు

యాగంటి క్షేత్రం (పట్టణం నుండి 10 కి.మీ), యాగంటి వెళ్ళే దారిలో బనగానపల్లె నవాబు బంగ్లా, రవ్వలకొండలో బాలాంజనేయస్వామి, పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం, భానుముక్కలలోని శ్రీ పెద్ద ఆంజనేయస్వామి ఆలయం, ఇల్లూరు కొత్తపేట గ్రామంలోని హనుమంతరాయ దేవాలయం, నందివర్గం, పలుకూరు, నందవరం గ్రామాలలోని ఆంజనేయస్వామి దేవాలయాలు, పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం, చింతమాను మఠం మొదలుగునవి.

pc: Raghuramacharya

వసతి

వసతి

బనగానపల్లిలో స్టే చెయ్యటానికి ప్రెవేట్ లాడ్జులతో పాటు బ్రహ్మంగారి మఠం వారి వసతి గృహాలు ఉన్నాయి. మఠం వారి వసతి గృహాలు అచ్చమాంబగారి ఇల్లు, రవ్వలకొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ ఏసి సదుపాయం కూడా ఉంది.

రవ్వలకొండ చేరుకోవటం ఎలా?

రవ్వలకొండ చేరుకోవటం ఎలా?

రవ్వలకొండ చేరుకోవటానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలి. బనగానపల్లె నుండి రవ్వలకొండ కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైతే లోకల్ గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కొండ పైకి చేరుకోవచ్చు. బనగానపల్లె కు హైదరాబాద్, కర్నూలు, డోన్, నంద్యాల, బెంగళూరు, ప్రొద్దుటూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులలో ఎక్కి చేరుకోవచ్చు. బనగానపల్లెలో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన బేతంచెర్ల (20 కి. మీ), తాడిపత్రి( 62 కి. మీ), నంద్యాల (38 KM ), డోన్ జంక్షన్ (58 KM), కర్నూలు(73 KM) . పట్టణానికి సమీపాన కడప విమానాశ్రయం (130 కి.మీ), రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (258 కి. మీ) కలవు.

pc: Reuleaux