» »రండి.. ఈ వీకెండ్ కి అరుంధతీ కోటకి వెళ్దామా!

రండి.. ఈ వీకెండ్ కి అరుంధతీ కోటకి వెళ్దామా!

Posted By: Venkata Karunasri Nalluru

బనగానపల్లి కోట యాగంటి వెళ్ళే మార్గంలో ఉంది. ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని ఉంపుడుగత్తెకు కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిధిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెద్ద హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడే "అరుంధతి సినిమా" షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లన దీనిని అరుంధతి కోట గా ఇక్కడి ప్రజలు పిలిచుకుంటారు.

బొమ్మాలీ వదలా....మరిచిపోయే డైలాగా ఇది. అరుంధతీ సినిమా 2009లో వచ్చింది.సూపర్ హిట్ అయింది.మిమ్మల్ని వదలా అంటూ,నందుల్ని వదలా అంటూ 9నంది అవార్డులని గెలుచుకుంది. అయితే అనుష్క స్టోరీ, కోడిరామకృష్ణ టేకింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి ప్రధాన పాత్ర పోషించిన అరుధంతీ కోట కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది.అసలీ కోట వుందా? వుంటే ఎక్కడ వుంది? ఇప్పుడెలా వుంది? అరుంధతి సినిమాని అక్కడే తీశారా? సెట్ వేశారా? ఇలాంటి డౌట్స్ కి సమాధానం కావాలంటే ఖచ్చితంగా కర్నూలుకి 80 కి.మీ ల దూరంలో వున్న బనగానపల్లి వెళ్తే అక్కడే కనపడుతుంది.ఈ కోట బంగ్లా. అరుంధతీ సినిమా కోసం ఇదే కోట సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా వేసారు. దాదాపు 85 లక్షలు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇండోర్ షూటింగ్ కోసం ఒకసారి ఆలోచించండి.
85లక్షలు ఖర్చు పెట్టి వేసిన సెట్ ని మళ్ళీ ఏ పార్ట్ కాపార్ట్ తీసేయాలంటే ఎంత శ్రమపడి ఆ కోటను హైలైట్ చేశారంటే ఎంత ప్రాధాన్యత వుండి వుంటుంది.

అరుంధతీ కోట నిజంగానే వుందా?

1.బనగానపల్లి కోట

1.బనగానపల్లి కోట

అలాగే బనగానపల్లి కోటలో కూడా అరుంధతి సినిమాని షూట్ చేశారు. ఈ కోటకి వాళ్లకి కావలసిన రీతిలో ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ అవన్నీ తీసేశారు. దీనికి ఓ యాభై లక్షలు ఖర్చు పెట్టారు. కోట బంగ్లా ఒరిజినాలిటీని పోగొట్టకుండా వున్నారు.

Photo Courtesy: nativeplanet

2.అరుంధతి కోట

2.అరుంధతి కోట

అరుంధతి కోట బనగానపల్లె - యాగంటి పోయే దారోలో ఉంది ఈ కోట. ఇక్కడే "అరుంధతి సినిమా" షూటింగ్ చేసింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లనేనేమో దీనిని అరుంధతి కోటగా నామకరణం చేశారు ఆ ఊరి ప్రజలు. సినిమా యూనిట్ అంతా ఇక్కడే ఒక నెల రోజులు మకాం వేసి షూటింగ్ చేశారు. ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది.

Photo Courtesy:youtube

3. నవాబు వేసవి విడిది

3. నవాబు వేసవి విడిది

ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని ఉంపుడుగత్తెకు కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిధిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెడా హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది.

Photo Courtesy:youtube

4. అద్భుతమైన కోట

తెలుసుకోవాలన్న ఆశక్తికి సమాధానమే ఈ బనగానపల్లి కోట. ఈరోజుకీ అక్కడికి వచ్చి ఆ కోటంతా తిరిగి చూసి కాసేపు గడిపేవాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్ లో చూడదగ్గ మంచి టూరిస్ట్ ప్లేసులలో ఒకటి.

Photo Courtesy:youtube

5. బనగానపల్లె ఎలా చేరుకోవాలి?

5. బనగానపల్లె ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం : బెలుం గుహల రావాలంటే హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టులో దిగి, అక్కడి నుంచి వయా జడ్చర్ల, కర్నూలు మీదుగా బనగానపల్లెకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

Photo Courtesy:youtube

6. రైలు మార్గం

6. రైలు మార్గం

బనగానపల్లె రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ఇక్కడికి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. ఇక్కడికి చేరువలో ఉన్న మరొక ప్రధాన స్టేషన్ డోన్ జంక్షన్. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి నిరంతరం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

Photo Courtesy:youtube

7. రోడ్డు మార్గం

7. రోడ్డు మార్గం

బనగానపల్లెలో ఆర్.టి.సి. డిపో ఉన్నది. బనగానపల్లె నుండి రాయలసీమలోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం కలదు. హైదరాబాదుకి, కర్నూల్ కి ప్రతి రోజు రాత్రి బస్సులు కలవు.

Photo Courtesy: nativeplanet