» »మనకు తెలియని రహస్య పురాణ ప్రదేశాలు

మనకు తెలియని రహస్య పురాణ ప్రదేశాలు

Posted By: Venkata Karunasri Nalluru

ఆలంపూర్ నల్లమల కొండల పాదాల వద్ద ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణ, తుంగభద్ర నదులు సంగమిస్తూ ప్రవహించటం వల్ల దీనిని దక్షిణ కాశి అని కూడా అంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయాలు చూచుటకు ఆకర్షణీయంగా ఉంటాయి.

పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. నవ అంటే తొమ్మిది. ఆలంపూర్ లో శివునికి సంబంధించిన ఆలయాలు తొమ్మిది ఉన్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పరమశివుడు, జోగులాంబ (సతి దేవి) ప్రధాన దేవతలుగా వున్నారు.

alampur jogulamba temple distance from hyderabad

PC :Prashanth NS

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాముఖ్యతలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.

ఆలంపూర్ లోని దేవాలయం

alampur jogulamba temple distance from hyderabad

Photo Courtesy: RaghukiranBNV

ఆలంపూర్ పట్టణంలో వున్న ఆలయం అనేక రాజవంశాల పాలనలో వుండినది. ఇక్కడ అనేక యుద్ధాలు, దండయాత్రలు జరిగాయి.

ఆలంపూర్ వద్ద బాదామి చాళుక్యులు నవబ్రహ్మ దేవాలయాలు నిర్మించారు. అవి తొమ్మిదిగా వున్నాయి. తారక బ్రహ్మ దేవాలయం, బాల బ్రహ్మ దేవాలయం, స్వర్గ బ్రహ్మ దేవాలయం, పద్మ బ్రహ్మ దేవాలయం, గరుడ బ్రహ్మ దేవాలయం, అర్క బ్రహ్మ దేవాలయం, కుమార బ్రహ్మ, వీర బ్రహ్మ ఆలయం మరియు విశ్వ బ్రహ్మ.

జోగులాంబ ఆలయం

alampur jogulamba temple distance from hyderabad

Photo Courtesy: RaghukiranBNV

జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. ఈనాటి జోగులాంబ ఆలయం 1930 లో పునర్నిర్మించబడింది. జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశలో నెలకొని ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది.

సంగమేశ్వర టెంపుల్

alampur jogulamba temple distance from hyderabad

Photo Courtesy: Arun Kota

తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు ఉన్నాయి. స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్ లోని దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు ఉన్నాయి. పద్మ బ్రహ్మ దేవాలయం కూడా పాక్షికంగా శిథిలమైపోయినది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం ఉంది. విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు. బాల బ్రహ్మేశ్వరాలయం నవ బ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనది. జోగులాంబాలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధానార్చకాలయం ఇదే. జోగులాంబ పూర్వపు గుడి విధ్వంసం జరిగాకా, కొత్త ఆలయం నిర్మించేదాకా ఈ స్వామి ఆలయంలోనే పూజలందుకున్నది. ఈ దేవాలయం చుట్టూ బహిఃప్రదిక్షణాపథాన్ని, ప్రాకారాన్ని, ముఖమంటపాన్ని చాళుక్య విజయాదిత్యుడు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశాన్యాచారుడి కృషి చెప్పుకోదగినదని అంటారు.

9. చేరుకోవడం ఎలా ?

ఇది హైదరాబాద్ నుండి ఆలంపూర్ చుట్టూ 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.

క్లిక్ చేయండి:

కర్నూలు ఎలా చేరాలి?

క్లిక్ చేయండి:

హైదరాబాద్ ఎలా చేరాలి?