Search
  • Follow NativePlanet
Share
» »మదిని పరవశింప చేసే మంగళూరు సౌందర్య సోయగాలు..

మదిని పరవశింప చేసే మంగళూరు సౌందర్య సోయగాలు..

కర్ణాటక ముఖద్వారంగా మంగుళూరు పట్టణాన్ని పేర్కొంటారు. ఎంతో అద్బుతమైన సౌందర్య కల కలిగిన నగరం. మంగళూరు నగరానికి ఒక ప్రక్క అరేబియా మహాసముద్రం, మరోప్రక్క పశ్చిమ కనుమలు ఈ నగరానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఎటు చూసినా పచ్చదనంతో, రోడ్డుకు ఇరువైపులా రారమ్మని ఆహ్వానిస్తూ వయ్యారంగా హొయలొలికించే లతలు. సముద్రతీరం నుండి వీచే పిల్లగాలి చక్కిళ్ళు తాకుతుంటే..ఆ గిలిగింతలకు మనస్సు పరవశిస్తుంటే..సాయం సంధ్య వేళకు సముద్రపు ఒడిలోకి మెల్లగా జారుకుంటూ..హాయిగా నిదురించే ఎర్రటీ సూరీడు కనులకు విందు చేస్తుంటే ఆహా ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. వర్ణించేదుకు పదాలు సరిపోవు. అంతటి ఈ నగరానికి దేవీ మాత మంగళా దేవి పేరు మీద మంగుళూరు అని నామకరణం చేశారు. ఇటువంటి చూడముచ్చటైన ప్రదేశాన్ని పర్యటించాలని ఎవరికి మాత్రం ఉండదు .

మంగళూరు నగరం వివిధ సంస్కృతుల సమ్మేళనం. మన దేశంలోనే అతి ముఖ్యమైన ఓడరేవులలో ఒకటిగా మంగళూరు ఓడరేవు ఉంది. ఇక్కడ నుండి మన దేశంలో పండిన కాఫీ, జీడిపప్పు, ఇతర వాణిజ్య పంటలను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఈ ఓడరేవు ఎగుమతులు, దిగుమతులతో ఎంతో సందడిగా కనబడుతుంది. మైసూరు పాలకులు హైదర్ ఆలి, టిప్పు సుల్తాన్ , పోర్చుగీసు వారు, బ్రిటీష్ వారు ఈ నగరం కోసం యుద్దాలు చేశారు.

ప్రకృతి అందాలకు ఒక స్వర్గదామం మంగుళూరు. ప్రకృతి సహజ అందాలు ఈ నగరానికి ఎంతో శోభనిస్తాయి. ఈ మంగళూరు నగరం గురుపుర మరియు నేత్రావతి నదుల మధ్య విస్తరించి ఉన్నది. అరేబియా సముద్రపు తీరంలోని సముద్రతీరాలు, తాటిచెట్లు, కొబ్బరి చెట్టు, అశోక చెట్లు ఎక్కడపడితో అక్కడ కనబడుతూ ఈ నగరానికి మరింత అందాన్ని తెచ్చాయి. ఈ సుందరమైన నగరం పచ్చటి కొండలు, ఎర్రటి పెంకుల ఉపరిభాగం కల ఇండ్లతో కనువిందే చేస్తూ ఉంటుంది.

మంగళూరులో చూడగ్గ సహజ అందాలు, వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న మంగళాదేవీ దేవాలయానికి దేశ వ్యాప్తంగా వేలాది భక్తులు వస్తారు. మంగళా దేవీ అంటే తారా భగవతి. నగరంలోనే అతి పెద్ద దేవాలయం మంగళాదేవీ ఆయలం, ఈ ఆలయంతో పాటు ఎన్నో పురాతన దేవాలయాలు, భవనాలు , కద్రి మంజునాథ దేవాలయం, సెయింట్ అలోషియస్ చాపెల్, రొసారియో కేథడ్రల్ చర్చి, జామా మసీదు, పనంబూర్ బీచ్, లైట్ హౌస్ హిల్, వంటి ఎన్నో చూడదగిన ప్రదేశాలకు మంగళూరు నరగం స్వర్గదామం. వీటితో పాటు పర్యాటకులను పరవశింప చేసే మరికొన్ని ప్రదేశాలున్నాయి. అవి..

1. మంగళాదేవి ఆలయం :

1. మంగళాదేవి ఆలయం :

మంగళూరులో అత్యంత ప్రసిద్ద ఆలయాల్లో మంగళాదేవి టెంపుల్ ఒకటి. హిందువుల ఆలయం అమ్మ శక్తి ఈ ఆలయంలో వెలసింది. కేరళ శైలిని తలపించే ఈ ఆలయాన్ని లార్డ్ పరుశురాముడు నిర్మించాడు.మంగుళూరు నగరానికి నైరుతి దిశగా 3 కి.మీ. దూరంలో ఉంది. దేవాలయం చుట్టూ చాలా కోటలు ఉన్నాయి.

PC: Gopala Krishna A

2.గోకర్ణనాథేశ్వర ఆలయం:

2.గోకర్ణనాథేశ్వర ఆలయం:

ఈ ఆలయాన్నిశివరూపాలలో గోకర్ణ రూపం ఒకటైన గోకర్ణ నాథునికి అంకితం చేయబడినది. మంగళూరు దసరా వేడుకలకు ఈ ఆలయం చాలా ప్రసిద్ది. ఇది మంగళూరు సిటి సెంటర్ కు 2కిలోమీటర్ల దూరంలో ఉంది.

Photo Courtesy: Premkudva

3.కద్రి మంజునాథ్ ఆలయం:

3.కద్రి మంజునాథ్ ఆలయం:

కద్రి మంజునాథ్ టెంపుల్ మంగళూరు నగరంలో చాలా అందమైనది, ప్రసిద్ది చెందినది. మంగళాదేవీ ఆలయంతో మరియు గోకర్ణ నాథేశ్వర టెంపుల్ ఈ రెండు మంగళూరులో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలలో ప్రధానమైనవి.

PC: Ssriram mt

4.పనంబూర్ బీచ్:

4.పనంబూర్ బీచ్:

మంగళూర్ లో మోస్ట్ ఫేమస్ బీచ్ పనంబూర్. ఈ బీచ్ ఎక్కువ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పనంబూర్ బీచ్ తో పాటు, సోమేశ్వర అండ్ థన్నీర్ బావీ బీచ్ లు పర్యాటకులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది.

PC: Dr. Rushikesh joshi

5. సెయింట్ మేరీస్ ఐస్ లాండ్ :

5. సెయింట్ మేరీస్ ఐస్ లాండ్ :

సెయింట్ మేరీస్ ఐస్ లాండ్ ను కోకనట్ ఐస్లాండ్ అని కూడాపిలుస్తారు. ఇది ఉడిపి జిల్లాలోని మల్పేలో ఉంది. మంగళూరు ఇండిస్ట్రియల్ ఏరియాకు 60కిలోమీటర్ల దూరంలో ఉంది.

Image Courtesy: Brunda Nagaraj

6. సోమేశ్వర బీచ్:

6. సోమేశ్వర బీచ్:

సోమేశ్వర్ బీచ్, మంగుళూరుకు దక్షిణాన 18 కి.మీ. దూరంలో ఉంది. ఇసుక తిన్నెలు, ఈత చెట్లుతో శోభాయమానంగా ఉంటుంది. ఈ బీచ్ లో ‘రుద్ర శిల ' అనే పెద్ద రాయి ఉంది. అబక్కదేవి పాలనలో ఒక మందిరం నిర్మించారు. బీచ్ లో నిలబడితే, అరేబియన్ సముద్రం చక్కగా కనపడుతుంది. ఈ ప్రదేశం సోమేశ్వర బస్ స్టాండ్ నుండి చేరవచ్చు. మందిరం నుండి అర్ధ కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది.

Photo Courtesy: Niyant Dalal

7. రొజారియో కేధడ్రల్

7. రొజారియో కేధడ్రల్

ఈ చర్చిని 1568లో పోర్చుగీసు పాలకులు నిర్మించారు. అతిపురాతనమైన ఈ చర్చిని 1910 సంవత్సరంలో మరోమారు రోమన్ డిజైన్లతో పునర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో మంగుళూరు సిటీలోని హంపన కట్ట అనే ప్రాంతంలో ఇది ఉంది. 1910 సంవత్సరంలో ఫాదర్ హెచ్ ఐ బుసోని అనే పార్శీ పూజారి పాత భవనాన్ని కూలగొట్టి కొత్త నిర్మాణం పని మొదలు పెట్టాడు.

PC: Krishna Mohan

8. ఉడుపి శ్రీ కృష్ణ మఠం :

8. ఉడుపి శ్రీ కృష్ణ మఠం :

శ్రీ కృష్ణుడికి అంకితం చేసిన ఆలయాల్లో ఒకటి ఉడుపి శ్రీ కృష్ణ మఠం . కృష్ణుడికి అంకితం చేసిన అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. తుళు ప్రాంతంలో ఉండే ఉడిపితో సహా అనంతేశ్వర దేవాలయం మరియు ఉడుపి వంటశాలకు చెందిన అష్ట మాథాలకు ప్రసిద్ధి చెందింది.

PC: Krishna Mohan

9. లైట్ హౌస్ హిల్ గార్డెన్:

9. లైట్ హౌస్ హిల్ గార్డెన్:

లైట్ హౌస్ హిల్ గార్డెన్ సిటి నడిబొడ్డున ఉంది. దీన్ని టాగోర్ పార్క్ అని కూడా పిలుస్తారు.ఇది 18 వ శతాబ్దంలో హైదర్ అలీచే నిర్మించబడింది. ఇక్కడికి వచ్చే ఓడరేవులను పర్యవేక్షించడానికి బ్రిటీష్ సైన్యం ఉపయోగించినది. ప్రస్తుతం ఈ ప్రదేశం అందమైన తోటగా మార్చబడింది, ఇక్కడ సముద్ర తీరంలో జాగింగ్ , ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రదేశం మరియు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం . లైట్ హౌస్ స్థావరం వద్ద లైబ్రరీతో పాటు రీడింగ్ రూమ్ స్థాపించబడింది. ఇది పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షింపబడుతున్నది.

PC: Shuba

10.కర్కాల గోమటేశ్వర టెంపుల్:

10.కర్కాల గోమటేశ్వర టెంపుల్:

పశ్చిమ కనుమల కొండలపై స్థిరపడిన కార్కలా ఉడుపి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం. కర్కల కూడా జైన తీర్థయాత్ర ప్రదేశాల్లో ప్రసిద్ది చెందినది.గమ్మత్తేశ్వర కొండపై 42 అడుగుల ఏకశిల విగ్రహం ఉన్న బాహుబలి విగ్రహం ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామహక్షీభిషేకా అని పిలువబడే ఒక ఉత్సవ జరుగుతుంది.మంగుళూరు ఎన్నో శతాబ్దాలనుండి వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. నేటికి ఒక సుందర నగరంగా విరాజిల్లతోంది.

PC: Dr Murali Mohan Gurram

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more