Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ లో మీకు తెలియని ప్రదేశాలు !!

హైదరాబాద్ లో మీకు తెలియని ప్రదేశాలు !!

పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం హైదరాబాద్. హైదరాబాద్ లో గోల్కొండ - చార్మినార్ వంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పర్యాటక స్థలాలూ ఉన్నాయి. జూపార్క్ వంటి ఆహ్లాదకర ప్రదేశాలున్నాయి. ఎన్నో ఆలయాలున్నాయి. ఎన్నో ప్రదర్శనశాలలున్నాయి. పలు రాజ భవనాలు రాజ దర్పాన్ని ఒలకబోస్తున్నాయి. సినీ అభిమానులను అలరించడానికి పలు సినీ స్టుడియోలు,ఐమాక్స్ థియేటర్లు వున్నాయి.అబ్బో... హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు చాలానే వున్నాయి.

హైదరాబాద్ అనగానే మనకు వెంటనే కామన్ గా గుర్తొచ్చేది చార్మినార్, బిర్లా టెంపుల్, హుస్సేన్ సాగర్ లోని బుద్దుడి విగ్రహం, ఐ మాక్స్. కానీ మనకు తెలియనివి మనం తప్పకుండా చూడవలసినవి హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు, హైదరబాద్ ని సందర్శించడానికి వచ్చినవారు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలని మీ కోసం అందిస్తున్నాం.. ఇవన్నీ చూసిన తర్వాత ఫేమస్ హైదరాబాద్ దమ్కా బిరియాని టేస్ట్ చెయ్యడం మర్చిపోరుగా...

హైదరాబాద్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సురేంద్రపురి

సురేంద్రపురి

నగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్బుతమైన మ్యుజియం. పౌరాణిక అవగాహన కేంద్రంగా కూడా ఈ మ్యూజియం ని పిలుస్తారు. భారత పురాణాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యుజియమ్ ని ఏర్పాటు చేసారు. భారత దేశం లో ఉన్నప్రఖ్యాతమైన మరియు ముఖ్యమైన ఆలయాల మినియెచర్ లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలావిగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని ఒక్క సారి సందర్శిస్తే భారత దేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

Photo Courtesy: Aditya Chandra

స్పానిష్ మాస్క్

స్పానిష్ మాస్క్

ఐవాన్ - ఎ - బేగుంపేట్ లేదా మసీద్ ఇక్బాల్ ఉడ్ దాలా అని స్థానిక భాషలో ప్రసిద్ది చెందిన ఈ స్పానిష్ మాస్క్ హైదరాబాద్ పరిసరాల్లో ఉంది. స్పెయిన్ లో ఉన్న కేథడ్రాల్ మాస్క్ అఫ్ కార్డోబా శైలి లో నే ఈ మాస్క్ నిర్మితమయింది. మాస్క్ అఫ్ మూర్స్ గా కుడా ప్రాచుర్యం పొందిన ఈ మాస్క్ నిర్మాణ శైలిలో ప్రత్యేకమైన మూరిష్ నిర్మాణ శైలి కూడా కనిపిస్తుంది. బయట నుండి చుస్తే ఒక చర్చ్ లా కనిపించడం కూడా ఈ మాస్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందడానికి గల కారణం.

Photo Courtesy: Shakti Smaran

షామీర్ పేట్

షామీర్ పేట్

హైదరాబాద్ యొక్క శివారు ప్రాంతమైన షామీర్ పెట్ సికింద్రాబాద్ కి 20 కిలోమీటర్ల దూరంలో నిజాములచే నిర్మించబడిన మానవ నిర్మిత చెరువు. వారాంత విశ్రాంతికి ఇక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు ,హోటళ్ళు మరియు ఒక క్లబ్బు అందుబాటులో ఉన్నాయి. షామీర్ పెట్ లో ఉన్న జింకల పార్కు లో జింకలె కాకుండా నెమళ్ళు మొదలగు అనేక రకాల పక్షులు కూడా కనబడతాయి. ఈ పార్క్ షామీర్ పేట చెరువుకి అతి సమీపంలో ఉంది. ఎన్నో తెలుగు సినిమాలు ఈ చెరువు చుట్టూ పక్కల ప్రదేశాలలో నిర్మితమైనాయి.

Photo Courtesy: hemant kumar / Alosh Bennett

పురాని హవేలీ

పురాని హవేలీ

స్వాతంత్ర్యం కి పూర్వం ఈ పురాని హవేలీ లేదా పాత భవనం హైదరాబాద్ నిజాముల యొక్క అధికార నివాస గృహాలుగా ఉండేది. ఒక దానికి ఒకటి సమాంతరంగా నిర్మించిన రెండు ఎల్లిప్సోయిడాల్ విభాగాలు కలిగిన ఈ ప్యాలెస్ ఆకారం 'U" ఆకారంలో ఉంటుంది. ఈ పాలసు యొక్క మరొక ముఖ్య లక్షణం ఇక్కడ ఉన్న వార్డ్ రోబ్. ప్రపంచం లోనే అతి పెద్ద వార్డ్ రోబ్ గా ప్రసిద్దికెక్కింది. సౌకర్యార్ధం ఒక చెక్క ఎలివేటర్ కుడా ఈ వార్డ్ రోబ్ లో ఉంది.

Photo Courtesy: Randhir

పైగహ్ టొంబ్స్

పైగహ్ టొంబ్స్

పైఘ రాజ వంశీకులకి చెందిన పైగహ్ టొంబ్స్ అనబడే ఈ సమాధులు హైదరాబాద్ నగర శివార్లలోని పిసాల్ బండ దగ్గర ఉన్నాయి. నిజానికి అటువంటి నిర్మాణ శైలి ప్రపంచంలో మరొకటి లేదని భావిస్తారు. ఈ టొంబ్స్ స్టక్కో వర్క్ ద్వారా అలంకరించబడి, గ్రీకు , పెర్షియన్ , ముఘల్, రాజస్తాని, అసఫ్ జహి మరియు దక్కని నిర్మాణ శైలిల మేళవింపు తో ఉంటాయి. అప్పటి మహోన్నత కళా నైపుణ్యానికి ఈ టొంబ్స్ ఒక ఉదాహరణ గా నిలుస్తాయి.

Photo Courtesy:Nagarjun Kandukuru

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా ప్యాలెస్

అసఫ్ జాహీల అధికార నివాస స్థలమైన చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ నిజాములకి చెందినది. పర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమహల్లా ప్యాలెస్ పేరు వచ్చింది. వీటి అర్ధం నాలుగు ప్యాలెస్ లు అని అర్ధం. 18 వ శతాబ్దంలో ఈ ప్యాలెస్ నిర్మాణం ప్రారంభమై, పూర్తవడానికి పది సంవత్సరాలు పట్టింది. అందువల్ల, ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణం మరియు ఆకృతి వివిధ రకాల శైలులతో ప్రభావితమయ్యాయి. నిజానికి, నిజాముల హయాంలో అన్ని విధాల ఉత్సవ వేడుకలని జరుపుకునేందుకు ఈ ప్యాలెస్ ని ఉపయోగించేవారు.

Photo Courtesy: Eustaquio Santimano

ఆనంద బుద్ధ విహార

ఆనంద బుద్ధ విహార

హైదరాబాద్ లో ఒక చిన్న కొండ మీద ఉన్న ఆనంద బుద్ధ విహార ఆసక్తికరమైన బుద్దుని ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించే మీ మొదటి చూపే ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తుంది. ఈ కొండని ఎక్కగలిగితే పైనుండి అద్భుతమైన నగరం యొక్క అందాలని వీక్షించవచ్చు.అతి పెద్ద వైన కిటికీలు కలిగి ఉండడం వల్ల సహజ సిద్దమైన సూర్యరశ్మి ఈ ఆలయం లో ఉండే పెద్ద హాల్ లోకి వస్తుంది. బంగారం తో తయారు చేసిన భారీ బుద్ధుడి విగ్రహం ఈ హాల్ మధ్యలో ఉంటుంది.

Photo Courtesy: David Huang

బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

హైదరాబాద్ లో ఉన్న బిర్లా ప్లానిటోరియం దేశం లో నే మొట్ట మొదటి ప్లానిటోరియం గా ఖ్యాతి గడించింది. ఇది అప్పటి వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ గొప్ప ప్రదేశాన్ని పిల్లలతో సందర్శించాలనుకునే వారు మరువకూడదు.ఈ ప్లానిటోరియం లో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు. విజ్ఞానంతో పాటు విశ్వ పర్యటన చేసినటువంటి వినోదాన్ని కూడా అందిస్తుంది ఈ ప్లానిటోరియం.

Photo Courtesy: David Huang

సాంఘి టెంపుల్

సాంఘి టెంపుల్

హైదరాబాద్ యొక్క నగర శివార్ల లో సాంఘి టెంపుల్ ఉన్నది. ఇక్కడి ఏంతో పవిత్రమైన పొడవాటి రాజ గోపురం ఈ కోవెల యొక్క పేరు ప్రఖ్యాతలను ఇంకా పెంచింది.నిజానికి చాలా దూరం నుంచి ఈ రాజ గోపురాన్ని చూడవచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్త జనం ఇక్కడి భగవంతుని ఆశీస్సుల కోసం వస్తారు.చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడి కొండ అందాలని చూడటానికి వస్తారు. ఈ ఆలయ మెట్ల పైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణ గా ఉంటుంది.వాయు పుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయ యొక్క చాలా ఎత్తు అయిన ప్రదేశం లో ఉంటుంది.

Photo Courtesy: Veerabhadra G

అస్మాన్ గర్ పాలస్

అస్మాన్ గర్ పాలస్

'ఆకాశం యొక్క ఇల్లు' అనే అర్ధం వచ్చేటట్టు పేరు ఉన్న ఆస్మాన్ గర్ పాలస్ హైదరాబాద్ లో ని ఒక చిన్న కొండ మీద నిర్మితమై ఉంది. ప్రస్తుతం, పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఈ ప్యాలెస్ మారింది. గోతిక్ శైలిలోనే ఈ ఆస్మాన్ గర్ పాలసు యొక్క నిర్మాణం ఉంది. మధ్యయుగపు యురోపెయన్ కోట ఆకృతిలో ఈ భవన నిర్మాణం జరిగింది.

Photo Courtesy: hello hyderabad

ఢొలా రి దని

ఢొలా రి దని

రాజస్థానీ గ్రామాల సాంప్రదాయ నమూనా తో ధోలా రి ధని ని హైదరాబాద్ నగరం లోతయారుచేసారు. నగరం నుండి చాలా దూరంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం దైనందిన హడావిడి నుండి దూరంగా వారాంతపు సెలవలు గడపడానికి అనువుగా ఉంటుంది. సికింద్రాబాద్ నుండి ఈ ప్రాంతం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒంటె మరియు గుర్రపు స్వారీలు, జానపద సంగీతం మరియు డాన్సులు, తోలుబొమ్మ ప్రదర్శనలు, రైన్ డాన్సులు మరియు బోటింగ్ వంటివి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఎన్నో తెలుగు సినిమా షూటింగ్ లు కూడా మీరు గమనించవచ్చు.

Photo Courtesy: pangalactic gargleblaster / DAC 007

రేమండ్ టూంబ్

రేమండ్ టూంబ్

నిజాముల సైనికుల ప్రఖ్యాత ఫ్రెంచ్ జనరల్ అయిన మైఖల్ జోచిం మేరీ రేమండ్ సమాధి కలిగిన ప్రాంతం రేమండ్ స్ టూంబ్. ఈ సమాధి 200 సంవత్సరాల పుర్వానిది. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులచే పూలు, అగరబత్తిలచే ఈ సమాధి తరచూ సందర్శింపబడేది. నిజానికి, నిజాములచే ఈ సమాధి దగ్గర అర్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చ్ 25 వ తారీఖున డబ్బాడు పొగ చుట్టలు ఇంకా ఒక సీసాడు బీరు ఇక్కడికి పంపించేవారు. నిజాములు రేమండ్ ని అత్యున్నత స్థాయినిచ్చి గౌరవించారు.

Photo Courtesy: krishna gopal

ఉజ్జయిని మహంకాళి టెంపుల్

ఉజ్జయిని మహంకాళి టెంపుల్

హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం లో శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ పుర్వానికి చెందినదని నమ్మకం. ఈ గుడిలో శక్తి కి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు. బోనాలు పండుగని కూడా ఈ ఆలయంలో ఏంతో సంబరంగా , ఆరాధనతో జరుపుకుంటారు. ప్రశాంతమైన, నిలకడగా ఉన్న జీవితాన్ని భూమి పైన ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ ద్వారా మహంకాళి మాతని ప్రార్ధించేందుకు ఈ పండుగ చేస్తారు.

Photo Courtesy: Siddhartha Shukla

హయత్ బక్షి బేగం మాస్క్

హయత్ బక్షి బేగం మాస్క్

హయత్ బక్షి బేగం మాస్క్ అని లేదా హయత్ బక్షి మాస్క్ అని ఇంకా హయత్నగర్ గ్రాండ్ మాస్క్ అని కూడా పిలువపడుతుంది. ఈ మసీదు హైదరాబాద్ లోని ముస్లిములకు చాలా పవిత్రమైనది. ఈ మసీదులో ప్రార్ధనలు చేసుకోవడమే కాకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పర్యటించే పర్యాటకులకు విశ్రాంతిని అందించే ప్రదేశంగా కూడా ఈ మసీదు ఉపయోగపడుతుంది. ఒక ఎత్తైన వేదిక మీద ప్రార్ధనా మందిరం ఏర్పాటు చేసారు.

Photo Courtesy: Nagarjun Kandukuru

చిలుకూరి బాలాజి దేవాలయం

చిలుకూరి బాలాజి దేవాలయం

ఈ దేవాలయం "వీసా బాలాజి టెంపుల్" లేదా "వీసా గాడ్" గా ప్రసిద్ధి చెందినది. ఇది ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున అక్కన్న, మాదన్న నిర్మించిన పురాతన హిందూ దేవాలయం. ఈ టెంపుల్ లో హుండి ఉండదు. వివిఐపి దర్శనాలు ఉండవు. ఇది మెహదీపట్నంకి 17 కి.మీ. దూరంలో కలదు. ఈ గుడిని 13 వ శతాబ్ధంలో కట్టించినారు.

Photo Courtesy: jitendra_hassija

ఇస్కాన్ దేవాలయం

ఇస్కాన్ దేవాలయం

హైదరాబాదు లో ఇస్కాన్ దేవాలయం అబిడ్స్ కూడలి నుండి, నాంపల్లి స్టేషనుకు వెళ్ళే దారిలో ఒక వీధిలో ఉన్నది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయమునకు చేరువలో ఉన్నది. ఆలయము కట్టుటకు, స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి దానం చేశారు. ఆ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు మరియు ఈ ప్రదేశం నిత్యం కృష్ణుని కీర్తనలతో మారుమ్రోగుతూ ఉంటుంది.

Photo Courtesy: Mahat Tattva Dasa

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం

హైదరాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి భారతదేశంలోని అన్నిప్రధాన నగరాలకు మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

రైలు రవాణా

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది.ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. హైదరాబాదులో మొత్తం మూడు ముఖ్య రైల్వేస్టేషన్లు ఉన్నాయి 1)సికింద్రాబాదు రైల్వేస్టేషను 2)నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్) 3)కాచిగూడ రైల్వేస్టేషను.హైదరాబాదులో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ( MMTS ) ఉంది.

రోడ్డు రవాణా

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉన్నది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి.జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుండే వెళ్తుంటాయి.

Photo Courtesy: username8115

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X