Search
  • Follow NativePlanet
Share
» »అమర్ కోటలోని శిలా దేవి ఆలయం !

అమర్ కోటలోని శిలా దేవి ఆలయం !

By Mohammad

కథలు ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి అందులో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే, ఇక్కడ చెప్పబోయే ప్యాలస్ కూడా ఆసక్తికరమైన కథను కలిగి ఉన్నది. విషయం ఏమిటంటే, శిలా దేవి ఆలయం అమర్ ఫోర్ట్ లో ఉండటమే ! ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉండాల్సిన ఈ ఆలయం ఇక్కడకు ఎలా వచ్చిందో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం ..!

అమర్ కోట గా కూడా పిలవబడే అంబర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో, జైపూర్ కు 11 కిలోమీటర్ల దూరాన ఉంది. ప్రత్యేకించి హిందూ, ముస్లిం (మొఘల్) శిల్ప కళా శైలుల మేలు కలయిక అయిన అచ్చేరువొందించే అద్వితీయ శిల్ప కళా నైపుణ్యం, అలంకరణలకు అంబర్ కోట ప్రసిద్ధి చెందింది.

ఇది కూడా చదవండి : 'పింక్ సిటీ' జైపూర్ లోతప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !

అమర్ ఫోర్ట్ ప్రవేశ ద్వారం

అమర్ ఫోర్ట్ ప్రవేశ ద్వారం

చిత్ర కృప : Firoze Edassery

మొత్తం కోటల సముదాయం వలెనే, అంబర్ కోట కూడా తెల్లని పాల రాయి మరియు ఎర్రని ఇసుక రాళ్లతో నిర్మించబడింది. కోట అంతర్భాగంలోని గోడల పై వర్ణ చిత్రాలు, కుడ్య చిత్రాలు, దైనందిన జీవితంలోని వివిధ అంశాలను వర్ణించే చిత్రాలు దర్శనం ఇస్తాయి. ఇతర గోడల పై పాలరాయి , చిన్నచిన్న అద్దాలతో చేసిన పనితనం, క్లిష్టమైన శిల్ప కళా నైపుణ్యాలను చూడవచ్చు.

మహారాజా మాన్ సింగ్ -1 పై బెంగాల్ పాలకుడైన కేదర్ ఎన్నో అవమానాలకు గురిచేస్తాడు. ఆ బాధ లోంచి తనకు శాశ్వత విముక్తి కావాలని, యుద్ధంలో అతని పై (కేదర్ పై) గెలవటానికి కొండత శక్తిని ప్రసాదించి శక్తి స్వరూపిణి కాళీ మాతను వేడుకుంటాడు. అమ్మవారు రాత్రి కలలో ప్రత్యక్షమై, మాన్ సింగ్ కు 'శుభం కలుగుగాక' అంటూ ఆశీర్వాదం ఇస్తుంది.

మాన్ సింగ్ ప్యాలెస్

మాన్ సింగ్ ప్యాలెస్

చిత్ర కృప : Vssun

యుద్ధంలో విజయం సాధించి నందుకు గాను అమ్మవారు కోటలో తనకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని అడుగుతుంది. ప్రస్తుత బంగ్లా దేశ్ లోని జెస్సోరీ అనే తీరప్రాంతంలో ఉన్న తన పురాతన విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్టించాలని చెబుతుంది.

మాన్ సింగ్, ఆ ప్రదేశానికి వెళ్లి వెతుకుతాడు. అక్కడ అతనికి ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. ఆ రాయిని జైపూర్ కు తీసుకొని వచ్చి నీటిగా శుభ్రపరిచి చూస్తే, శక్తి స్వరూపిణి కాళీమాత తేజోమయంగా వెలిగిపోతూ సాక్షాత్కరిస్తుంది. రాజు, అమ్మవారి ఆజ్ఞానుసారం కోటలో గుడి ని కట్టిస్తాడు. అదే శిలా దేవి ఆలయం (అమ్మవారు శిల లో కనిపించింది కాబట్టి).

శిలా దేవి ఆలయం ప్రవేశ ద్వారం

శిలా దేవి ఆలయం ప్రవేశ ద్వారం

చిత్ర కృప : Adamina

కోట ప్రవేశ ద్వారానికి ముందు ఉన్న ఇరుకైన మెట్ల మార్గం శైలాదేవి ఆలయంగా కూడా పిలవబడే కాళి ఆలయంకు దారి తీస్తుంది, అతి పెద్ద వెండి సింహాల కారణంగా ఈ ఆలయం ఖ్యాతి గాంచింది. ఈ వెండి సింహాల మూలాలు, ప్రయోజనాలు ఈనాటికీ ఎవరికీ తెలియని విషయాలు. ఉబ్బెత్తుగా కనిపించేలా చెక్కిన శిల్పకళతో అలంకరించబడిన వెండి తలుపులకు కాళికాలయం ప్రసిద్ధి చెందింది. మందిర ప్రవేశ ద్వారం వద్ద గల, ఒకే ఒక పగడం నుండి చెక్కిన వినాయక విగ్రహం సందర్శకులకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

గోడలపై చెక్కిన ఇది వెండి శిల్పాలు

గోడలపై చెక్కిన ఇది వెండి శిల్పాలు

చిత్ర కృప : damina

శిలా దేవి ఆలయం, జైపూర్ లోని ఆలయాలలో కెల్లా అత్యంత ప్రసిద్ధి చెందినది. దసరా నవరాత్రుల ఉత్సవాల సమయంలో శక్తి స్వరూపిణి శిలామాత ను దర్శించుకోవటానికి వేలమంది భక్తులు వస్తుంటారు.

అమర్ ఫోర్ట్ కేవలం జైపూర్ యొక్క చిహ్నం (ల్యాండ్ మార్క్) మాత్రమే కాదు, ఫెవరెట్ బాలీవూడ్ సినిమాకు షూటింగ్ స్పాట్ కూడా!

నేడు పర్యాటకులు కొండ దిగువ భాగం నుండి ఏనుగు సవారీలను ఎక్కి కోట వరకు చేరుకోవచ్చు. సవారీ చేస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న కొండలు, భవనాలు, మావుత సరస్సు, ఒకప్పటి నగర ప్రహరీ గోడలను చూడవచ్చు. ఎవరికి వారు స్వంతంగా గానీ లేదా గైడ్ సహాయంతో గానీ కోటను పర్యటించవచ్చు. వివిధ భాషల ఆడియో గైడ్లు కూడా లభిస్తాయి. సాయంత్రం వేళ ఏర్పాటు చేసే సౌండ్ అండ్ లైట్ షో తప్పక చూడాల్సిన వినోదం.

ఏనుగు సఫారీ, అమర్ ఫోర్ట్

ఏనుగు సఫారీ, అమర్ ఫోర్ట్

చిత్ర కృప : Daniel Mennerich

కోటలోని ప్రత్యేక ఆకర్షణలలో షీష్ మహలు (అద్దాల హాలు) ఒకటి. కోటలో రాజులు నివసించినప్పటి కాలంలో, ఒకే ఒక కొవ్వొత్తిని వెలిగించగా మహలులోని అసంఖ్యాకంగా గల చిన్న-చిన్న అద్దాల కారణంగా హాలు మొత్తం వెలుగు నిండేది అని టూర్ గైడ్లు సందర్శకులకు చెబుతారు.

ఇది కూడా చదవండి : జైపూర్ ఎలా చేరుకోవాలి ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X