Search
  • Follow NativePlanet
Share
» »ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలపాటు నీటిలో ఉండే ఆలయం ఎక్కడుందో తెలుసా? ఎందఱో మునులకు ఆశ్రయంఇచ్చిన ఈ దేవాలయం సంవత్సరంలో ఎనిమిది నెలలపాటు నీటిలోవుంటూ నాలుగు నెలలు భక్తుల పూజలు అందుకుంటుంది.మరి ఈ ఆలయం ఎక్కడ వుంది?

By Venkatakarunasri

ఎనిమిది నెలలపాటు నీటిలో ఉండే ఆలయం ఎక్కడుందో తెలుసా? ఎందఱో మునులకు ఆశ్రయంఇచ్చిన ఈ దేవాలయం సంవత్సరంలో ఎనిమిది నెలలపాటు నీటిలోవుంటూ నాలుగు నెలలు భక్తుల పూజలు అందుకుంటుంది.మరి ఈ ఆలయం ఎక్కడ వుంది?అన్నినెలల పాటు నీటిలో వుండుటకు గల కారణమేమి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. కర్నూలు అతిపెద్ద జిల్లా. ఇది హైదరాబాదు నుండి షుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కడప, చిత్తూర్, అనంతపూర్ చేరడానికి కర్నూల్ గుండా ప్రయాణించవలసి ఉండటం వల్ల దీనిని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. ఈ ప్రాంతం చిన్న ఊళ్ళ అందం, అతిధి సత్కారాల సంస్కృతితో పర్యాటకులలో ఒక మంచి అనుభూతిని కల్గిస్తుంది.

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

చారిత్రిక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో ఈ ప్రాంతం ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. చారిత్రిక వివరం ప్రాచీన సాహిత్యం, శాసనాల్లో చెప్పబడినట్టు కందనవోలు అనే తెలుగు పదం నుంచి కర్నూల్ అనే పేరు వచ్చింది. కర్నూల్ కి వేల సంవత్సరాల చరిత్ర వుంది. కర్నూల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న కేతవరంలో దొరికిన రాతి చిత్రం ప్రాచీన రాతి యుగం నాటిది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

జుర్రేరు లోయ, కటవాని కుంట, యాగంటి లలో లబించిన రాతి శిల్పాలు 35000 నుంచి 40000 ఏళ్ళ నాటివి. మధ్య యుగాలలో భారత దేశాన్ని సందర్శించిన జువాన్ జాంగ్ అనే చైనా దేశపు పర్యాటకుడు తన కధనాల్లో కరాచీ వెళ్ళే దారిలో కర్నూల్ ను దాటానని రాసుకున్నాడు. ఏడవ శతాబ్దంలో కర్నూల్ బిజాపూర్ సుల్తాన్ల పాలనలో వుండేది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

అంతకు ముందు దీన్ని శ్రీ కృష్ణదేవరాయల వారు పాలించారు. 1687 లో ఈ ప్రాంతాన్ని ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేజిక్కించుకుని దీన్ని నవాబుల అధీనంలో వదిలేశాడు. తరువాత నవాబులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని కర్నూల్ ను 200 ఏళ్ళ పాటు స్వతంత్రంగా పాలించారు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

18వ శతాబ్దంలో నవాబులు బ్రిటిష్ వారి తో పోరాడారు. పురాతన కట్టడాలు, ఆలయాల నగరం పురాతన కట్టడాలు, చారిత్రిక నిర్మాణాలు పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులకు, కర్నూలు అటువంటి ప్రదేశాలను విస్తృతంగా అందిస్తుంది. మధ్య యుగంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన కోటల శిధిలాలలో పురాతన కాలపు అరబ్బీ, పర్షియా శాసనాలు ఉన్నాయి.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఈ కోటను తప్పక సందర్శించాలి. కొండారెడ్డి బురుజు, అబ్దుల వహాబ్ సమాధి చూడదగిన అద్భుత ప్రదేశాలు. కర్నూల్ పాలకుల వేసవి విడిది, వరద రక్షిత గోడ, కొన్నిప్రాముఖ్యత కల్గిన పేట ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, షిర్డీ సాయి బాబా ఆలయం కూడా చూడ దగిన ప్రదేశాలు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

కర్నూలు నవంబరు, డిసెంబర్ నెలలలో ప్రసిద్ధ రధొత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ పండుగ ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. దీనిని ఆంజనేయస్వామి పేరున జరుపుకుంటారు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎక్కడ వుంది?

కర్నూలుజిల్లాకి 56కిమీ ల దూరంలో సంగమేశ్వరం అనే గ్రామంలో సంగమేశ్వరస్వామి వారి ఆలయం వుంది. ఇది చాలా పురాతనమైన ఆలయం.ఈ ఆలయం ధర్మరాజు ప్రతిష్టించగా పురాణాలు చెబుతున్నాయి.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

సంగమేశ్వరఆలయం ఏడునదులు కలిసే ప్రదేశం.అందుకే ఈ క్షేత్రానికి సప్తనదీసంగమం అని పిలుస్తుంటారు. ఆలయ పురాణానికొస్తే పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించటంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

సతీదేవి శరీరం నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. అయితే పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావటానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్టసమయానికి రాలేదు.ఋషుల సూచనలమేరకు వేప మొద్దుని శివలింగంగా మార్చి ప్రతిష్టించి పూజలు చేసాడు.ధర్మరాజు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేసాడు.భీముడ్ని శాంతింపచేయటానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీతీరంలోనే ప్రతిష్టించి భీమలింగంగా దానికి పేరుపెట్టాడు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్నతర్వాతనే సంగమేశ్వరుని దర్శించుకోవాలనే సూచించినట్లు స్థల పురాణం చెబుతుంది. ప్రపంచంలో ఏడునదులు ఒకే చోట కలిసే ఏకైకప్రదేశం సంగమేశ్వర్.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ,భద్ర, కృష్ణ, వేణి,భీమ, మలపహరిణి,భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది.మిగిలినవన్నీ స్త్రీ పేరులున్న నదులే.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

భవనాసి తూర్పునుండి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమంనుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ జ్యోతిర్లింగం, అష్టాదశశక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రం తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

అన్ని ఆలయాలలో లాగా ఈ క్షేత్రంలో నిత్యపూజలు జరగవు.ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువరోజులు శ్రీశైలం ప్రాజెక్టునీటిలో మునిగివుండడమేకారణం. మరో విశేషం ఏంటంటే వేలసంవత్సరాల క్రితం సంగమేశ్వరఆలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీచెక్కుచెదరకపోవటం దర్శనమిస్తూ ఒక్కింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఒకప్పుడు ఒక వెలుగువెలిగిన ఆలయం క్రమంగా శిదిలమయుపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200ల సంల క్రితం స్థానికప్రజలు నిర్మించారు. సుమారు లక్షా20000అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తేఅర్థమౌతుంది. కేవలం నాలుగునెలలు మాత్రమే దర్శనమిచ్చే ఈ దేవాలయాన్ని చూట్టానికి భక్తులు చాలాఆసక్తితో వస్తూంటారు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

చూడదగిన ప్రదేశాలు

నల్లమల అడవి

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు. ఈ అడవిలో పులులు ఎక్కువగా ఉండేవి, నాగార్జునసాగర్-శ్రీశైలం కు చెందిన పులులు ఈ అడవిలో ఒక భాగం. ఈ అడవులలో చిరుతలు తరచుగా కనిపిస్తాయి.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

షిర్డీ సాయిబాబా ఆలయం

షిర్డీ సాయిబాబా ఆలయం, 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రత్యెక ప్రాంతం. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఈ ఆలయ వాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది. అన్ని సమయాలలో ఈ ఆలయాన్ని సందర్శించ దగినప్పటికీ, పూజలు నిర్వహించే ఉదయం, సాయంత్ర సమయాలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి, ఈ నదినుండి వీచే చల్లని గాలి ఈ ప్రదేశాన్ని ఎంతో ఆహ్లదపరుస్తుంది. షుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

కర్నూలు మ్యూజియం

భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాల విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

కర్నూలు సందర్శనకు ఉత్తమ సమయం

వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమ సమయం. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో పర్యాటక కార్యక్రమాలు ఆనందకరంగా ఉంటాయి.

pc:youtube

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలా చౌకగా, తేలికగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్నూలుకు సరైన ధరలలో కాబ్స్ కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి.

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

రైలు ద్వారా

కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. హైదరాబాద్ నుండి రైలులో, అక్కడ నుండి రోడ్డు ద్వారా కర్నూలుకి రైలు ప్రయాణం చాలా తేలిక. కర్నూల్ కి స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

ఎనిమిది నెలలు నీటిలోనే ఉండే ఆలయం ఎక్కడో తెలుసా?

వాయు మార్గం ద్వారా

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X