Search
  • Follow NativePlanet
Share
» »సంక్రాంతి సంబరాలు చూసొద్దాం పదండి..పదండి..

సంక్రాంతి సంబరాలు చూసొద్దాం పదండి..పదండి..

ఇక వారం రోజుల్లో సంక్రాతి సలవులు వచ్చేస్తున్నాయ్. పల్లెలకు వెళ్ళే వారు పల్లెకు వెళతారు. పతంగులు(గాలిపటాలు )ఎగరేసేవారు..గాల్లో తేలిపోతుంటారు. మకర సంక్రాంతి హిందువుల పండగ కావడం వల్ల మన భారత దేశంలో అన్ని ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఆయా ప్రదేశాలను బట్టి పేర్లు, సాంప్రదాయలు డిఫరెంట్ గా ఉండవచ్చు. జనవరి 13 నుండి జనవరి 15 జరుపుకునే మకర సంక్రాంతిని ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారత దేశం వరకు హిందులు జరుపుకునే అతి పెద్ద పండగ.

ఈ సాంప్రదాయ పండగ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలవుల్లో కొంచెం తిరిగొద్దామని అనుకునే వారు మరికొందరు. నాలుగైదు రోజులు సెలవులు. ఇంకెందుకు ఆలస్యం మన ఊరు, మన పల్లె మాత్రమే కాదు, ఈ సారి జిల్లాలు దాటండి, రాష్ట్రాలు దాటి వెళ్లండి. సంకురాతిరి సంబరాలను సంతోషంగా ఆస్వాదించండి. మీ పర్యటనకు ఆహ్లాదకరమైన ప్రదేశాల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని, ఎంచక్కా చుట్టేసి రండి..

1. ఆంధ్రప్రదేశ్:

1. ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్ లో మకరసంక్రాంతిని మూడురోజుల పాటు జరుపుకునే అతి పెద్ద పండుగ. ఈ పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమగా జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాలలో ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. హిందువుల సాంస్కృతికి అద్ధం పట్టే పండుగ ఇది.

 ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్:

కొత్తగా పంటలు చేతికొచ్చిన సందర్భంగా ఆనందంతో రైలు ఈ పండుగ జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తున్నది కనుక దీన్ని రైతుల పండుగ అని అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ నెలరోజులు తెలుగు పల్లెలు చాలా ఆహ్లాదకరంగా అలరాతుంటాయి. బుడబుక్కల వాళ్ళు, పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు వీధులు కనబడుతున్నా పండవాతావరణాన్ని మరింత పెంచుతారు. ఇంటి ముంగిళ్ళను రంగవల్లులతో, గొబ్బెమ్మలతో భోగిమంటలు, సాయంత్ర పేరంటంలో పిల్లలకు భోగిపలళ్ళు పోయడం, కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి రావడం, మరదళ్ళ కొంటి చేస్టలలతో, కోడిపందాల జోరుతో ఎండ్లపందాల..ఇవన్నీ ఆంధ్ర సంక్రాంతి పండుగకు శోభనిచ్చేవి.

కర్ణాటక:

కర్ణాటక:

కర్ణాటకలో కూడా సంక్రాంతి పండుగను గ్రాడ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు . ముఖ్యంగా మకర సంక్రాంతి వేళ కృష్ణుడు కొలువైన ఉడిపి క్షేత్రం కోలాహలంగా ఉంటుంది. మకర సంక్రాంతి ఉత్తరాయన ప్రవేశం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు, సంక్రాంతి రోజున రథాల్లో నిర్వహించే శోభయాత్ర చాలా ఉత్సహాభరితంగా సాగుంది. ఉడిపిలో ఆలయంలో గర్భగుడిలోని కృష్ణుడిని ఆలయ కిటికిలో నుండి చూడాలి. కర్ణాటకా గ్రామాల్లో సంక్రాంతి సందర్శంగా నిర్వహించే కంబాల పోటిలు చూడాల్సిందే.

Most Read:ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ ఒక్కటి దర్శించినా మీ జన్మ ధన్యమే..Most Read:ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ ఒక్కటి దర్శించినా మీ జన్మ ధన్యమే..

తమిళనాడు:

తమిళనాడు:

తమిళనాడులో ఈ పండుగ పొంగల్ గా ప్రసిద్ది చెందినది. ఇక్కడ కూడా నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ రోజున భక్తులందరు సంపద బమరియు ఆయురారోగ్యాలు, సంతోషంగా ధన ధాన్యాలతో వ్రుద్ది చెదాలని ఆ సూర్యభగవానుడిని ప్రార్థిస్తారు. కొత్త పంటలతో పండిన బియ్యం, బెల్లంతో పాలుచేర్చి పొంగలి వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఇంటిల్లిపాదికి అందించి సంతోషంతో పండగను ఆహ్లాదకరంగా జరుపుకుంటారు.అలాగే కర్ణాటకాలో నవ్వులు, బెల్లం, కొబ్బరి, శెనగపప్పుతో తయారుచేసి ప్రసాదాన్ని దానంగా ఇస్తారు, అలాగే చెరకు గడను కూడా పంచడం ఇక్కడి ఆచారం.

Photo Courtesy: J'ram DJ

ఉత్తరప్రదేశ్:

ఉత్తరప్రదేశ్:

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రజలు పవిత్ర గంగానదిలో కర్మస్నానం చేస్తారు. అలహాబాద్ లో ‘మాఘ మేళ' వంటి భోగి మంట వేస్తారు. ఈ పండుగను పెద్ద ఉత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఇక్కడ ప్రజలు పేదవారికి నువ్వులు, చెరకు , కిచిడి వంటి తినుబండాలను దానం చేయడం ఆనవాయిచి.

గుజరాత్ :

గుజరాత్ :

గుజరాత్ లో మకర సంక్రాంతిని చాలా ఉత్సహాంగా ఆనందంతో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్బంగా స్నేహితులుకు , కుటుంబంలోనికి వారికి బహుమతులు పంచుకుంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ ఆకాశంలో రంగుల రంగుల గాలిపటాలతో చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఎంజ్ చేస్తారు. ఇటువంటి ఆనంద క్షణాలను ఎంజాయ్ మీరు ఎంజాయ్ చేయలేకపోతే మీరు దురదృష్టవంతుడు.

Most Read: తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారుMost Read: తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు

బెంగాల్:

బెంగాల్:

బెంగాల్లో ప్రత్యేకంగా గంగా సాగర్ ఉత్సవం నిర్వహించబడుతుంది. పంటలు బాగా పండినందుకుగాను సూర్యదేవునికి కృతజ్ఞతలు చెప్పటానికి వివిధ నగరాల నుండి వేలాది మంది భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటారు. బంగాళకాతం మరియు గంగానది పుష్కర స్నానాలకు మకర సంక్రమణ వేళ పుణ్యస్నానాలు చేయడం చాలా మందికి ఆచారం.

రాజస్తాన్ :

రాజస్తాన్ :

జైపూర్ మరియు జోద్ పూర్ లో బ్రైట్ అండవ్ కలర్ ఫుల్ రంగులతో అద్భుతమైన డిజైన్లతో పతంగులు సంబరాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ పవిత్రమైన రోజున పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇంటి పైకప్పుల మీద పతంగులను ఎగురవేస్తూ చాలా ఆహ్లాదంగా కనిపిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా పిల్లలు లడ్డులు, మూగ్ ఫాలి, గజక్ మరియు దాల్ పకోడి వంటి వంటలతో ఇంటిల్లిపాదికి పండగ వాతావరణం తలపించేలా వంటలు చేస్తారు.

pc - Reyacarmelite

మహరాష్ట్ర:

మహరాష్ట్ర:

మహరాష్ట్రాలో మకర సంక్రాంతి సందర్భంగా నల్లరంగు దుస్తులు ధరిస్తారు. ఈ చలికాలంలో శరీరం వెచ్చగా ఉండి, అనారోగ్యపాలు కాకుండా కాపాడుకోవడానికి నువ్వులు వివిధ రకాల వంటలు వండుతారు. ముఖ్యంగా నువ్వుల లడ్డులు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. మకర సంక్రాంతి రోజున నువ్వులు, చెరకు ఒకరికొకరు దానం చేసుకోవడం ఇక్కడ కూడా ఆచరణలో ఉంది.

Photo Courtesy: Phaneesh N

Most Read: మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!Most Read: మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!

 ఢిల్లీ:

ఢిల్లీ:

ఉత్తరాయకాలం ప్రవేశ సందర్భంగా డిల్లీ ప్రజలు హర్వెస్ట్ ఫెస్టివల్ గా జరుపుకుంటారు. ఈ ఉత్సవం వసంత కాలానికి సూచనగా ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకుంటారు.

మరి మకర సంక్రాంతి రోజున ఆకాశంలో రంగురంగుల పతంగులను చూడటానికి, బందులువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆహ్లాదకరమైన వాతావరణం, పల్లె వాతావరణం అనుభూతి చెండానికి మీరు రెడీనా...

Image courtesy: ins

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X