» »ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో !

Written By: Venkatakarunasri

LATEST:హైదరాబాద్ అందరికి నచ్చడానికి కారణం ఇవే ..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వున్న ఆలయం తుంగనాథ్ ఆలయం. ఇది మరెక్కడో లేదు. మన రాష్ట్రంలోనే వుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ కి50కిమీ ల దూరంలో,ఢిల్లీకి 304కి.మీల దూరంలో ఈ తుంగనాథ్ ఆలయం వుంది. సముద్రమట్టానికి 1273అడుగుల ఎత్తులో ఈ శివాలయం వుంది. తుంగనాథ్ అంటే శిఖరం అని అర్థం. మందాకిని, అలకానంద నదులు ఈ పర్వత లోయల్లో ప్రవహిస్తాయి. ఈ ఆలయం 1000సంల కన్నా పురాతనమైనదిగా భావిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం ఆ పరమశివుడు మరియు పార్వతీ దేవి కైలాసశిఖరంపై నివశిస్తారని మరియు పార్వతీదేవిని సాలిపుత్రిగా భావిస్తారు. అంటే "డాటర్ ఆఫ్ హిల్" అని పేర్కొనటం జరుగుతుంది. ఇక్కడ తుంగనాథ్ లో పాండవులు 5 కేదారనాథ్ ఆలయాలు నిర్మించారట. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో సొంతవారిని, గురువులను చంపినందుకు వారికి బ్రహ్మహత్యాదోషం కలుగుతుంది.

వేదవ్యాసుడు సూచన ప్రకారం ఆ శివుడిని పూజిస్తే వారికి పాపనివృత్తి కలుగుతుందని చెప్పడంతో వారు ఆ శివుడును దర్శించటానికి వెళ్తారు. కానీ ఆ పరమశివుడు వారిని కనిపించకుండా గుప్తాక్షి అనే గుహలోనికి వెళ్ళటం జరుగుతుందంట. పాండవులు అది గమనించి ఆ స్వామిని దర్శించి తమ పాపపరిహారం చేసుకోవాలని అనుకుంటారు.

ఇది కూడా చదవండి: చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన - మరువలేని అనుభూతి!

అక్కడికి వెళ్లేసరికి పరమశివుడు మరియు నందీశ్వరుడు కన్పించకుండా వారి శరీరాలు ప్రస్తుతం పంచాకేదారాలుగా చెప్పుకొనే ప్రాంతాలలో వుండటం జరుగుతుందంట. మరి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందటానికి పాండవులుఆ ఐదు ప్రాంతాల్లో ఆలయం నిర్మించి ఆ శివుడ్ని ప్రార్థించటం అనేది జరుగుతుందంట. రావణాసురుడు కూడా తుంగనాథ్ శిఖరంపై ఆ శివుని కోసం ప్రార్థిస్తాడట. 8 వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఈ శివుడ్ని ఇక్కడ పూజించటమనేది జరిగిందంట.

టాప్ ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి:

మహిమాన్విత ఆలయం

మహిమాన్విత ఆలయం

హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వతపానువుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. అందుకనే ఇహ సంసారం నుంచి విముక్తి చెందాలనుకునే ముముక్షువులకు ఈ ఆలయాలు తుది గమ్యంగా నిలుస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్ ఆలయం.

pc:youtube

చంద్రశిల

చంద్రశిల

హిమాలయాలలోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట.

pc:youtube

రాముడు సైతం

రాముడు సైతం

ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు! రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడన్న గాథ కూడా వినిపిస్తుంది.

రుద్ర ప్రయాగ... పవిత్ర పుణ్య క్షేత్రం!!

pc:youtube

శివుని ప్రసన్నం

శివుని ప్రసన్నం

ఈ తుంగనాథ్‌ క్షేత్రం 'పంచ కేదార' ఆలయాలలో ఒకటి. ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం వారికి అంటుకుంది కదా!

pc:youtube

పరమేశ్వరుడు

పరమేశ్వరుడు

ఆ పాపఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట. కానీ ఆ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతోకొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకనే వారికి కనిపించకుండా ఉండేందుకు ఆయన వృషభ రూపంలోకి మారిపోయాడట.

కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

pc:youtube

తేజస్సు

తేజస్సు

అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీమునికి ఎదురుపడ్డాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు! దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నమూ చేశాడు.

pc:youtube

శివుడు

శివుడు

మరి పరమేశ్వరుడేమీ తక్కువవాడు కాదు కదా! వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేర్వేరు చోట్ల వేర్వేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడట. అలా వృషభరూపంలోని శివుడు ఐదు చోట్ల వెలసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు.

ఆంజనేయ స్వామిని ద్వేషించే ఊరు !

pc:youtube

తుంగనాథ్‌ క్షేత్రం

తుంగనాథ్‌ క్షేత్రం

పంచకేదార క్షేత్రాలలో వృషభరూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్‌ క్షేత్రం. తుంగం అంటే పర్వతం అని అర్థం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు.

ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !

pc:youtube

ఎత్తైన శివాలయం

ఎత్తైన శివాలయం

పేరుకి తగినట్లుగానే ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తోంది. అవడానికి ఇంత ఎత్తున ఉన్నా, మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం తేలికే! 58వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఓ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చాలు, ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

pc:youtube

చంద్రశిల కొండ

చంద్రశిల కొండ

ఒకపక్కన మందాకినీ నది, మరో పక్క అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి. శీతకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా దుర్గమంగా మారిపోతుంది.

కణతల్ - ఉత్తరాఖండ్ ప్రసిద్ధ వేసవి విడిది !!

pc:youtube

నిత్యపూజలు

నిత్యపూజలు

అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడి తుంగనాథుని ఉత్సవవిగ్రహాన్ని మోకుమఠ్‌ అనే సమీప గ్రామానికి తీసుకువెళ్లి నిత్యపూజలను నిర్వహిస్తారు. అయితే కొందరు సాధకులు మాత్రం ఎవరి కంటా పడకుండా ఉండేందుకు శీతకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెబుతారు.

pc:youtube

తుంగనాథ్ ఆలయాన్ని దర్శించటానికి బెస్ట్ టైం

తుంగనాథ్ ఆలయాన్ని దర్శించటానికి బెస్ట్ టైం

మార్చ్ నుండి అక్టోబర్ వరకు చెప్పుకోవచ్చు.చలికాలంలో ఇక్కడ వాతావరణమనేది గడ్డకట్టుకుని పోయి వుంటుంది.

pc:youtube

చంద్ర శిల

చంద్ర శిల

పర్వత శిఖరం పై నుండి చూస్తే మంచుకొండలు మనల్ని వేరే లోకానికి తీసుకువెళ్ళినట్టుగా వుంటాయి. ఇది తుంగనాథ్ నుండి 2 కి.మీ ల దూరంలో వుంటుంది. చంద్ర శిల శిఖరాన్ని మైథాలజీ ప్రకారం శ్రీరాముడు ఆ శివుడ్ని ధ్యానించిన స్థలంగా భావిస్తారు. రావనాసురుడ్ని చంపినందుకు బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆ శివుడ్ని శ్రీరాముడు ధ్యానించాడట.

pc:youtube

కోటేశ్వర్ టెంపుల్

కోటేశ్వర్ టెంపుల్

ఇది కూడా రుద్రప్రయాగలోనే వుంది. మైథాలజీ ప్రకారం పరమశివుడు ఈ ప్రాంతంలో యోగాధ్యానం కోసం ఆగాడని మరొక కధనం ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసుడుశివుడ్ని ప్రార్ధించి ఎవరి తలపై అయితే చేయి వుంచితే వారు భస్మం అవుతారని వరాన్ని పొందాడో ఆ తరువాత ఆ శివుడ్ని భస్మం చేయాలని ప్రయత్నిస్తాడు.

pc:youtube

శ్రీ మహా విష్ణువు

శ్రీ మహా విష్ణువు

అప్పుడు ఆ పరమశివుడు ఈ గుహలో దాక్కోవటమనేది జరుగుతుందంట. శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ఎత్తి భస్మాసురుడ్ని ఇక్కడే భస్మం చేయటం కూడా జరుగుతుందంట.

pc:youtube

అద్భుతమైన హిమాలయాలు

అద్భుతమైన హిమాలయాలు

చంద్రశిల అనే పర్వత శిఖరాన్ని "మూన్ రాక్" అని అంటారు. 13000 అడుగుల ఎత్తులో సముద్రమట్టానికి వుంటుంది.ఈ శిఖరం పై నుండి అద్భుతమైన హిమాలయాలు, ప్రక్రుతిసౌందర్యాన్ని చూడవచ్చు. ముఖ్యంగా నందాదేవి, త్రిశూల్, కేదార్ పీక్ లాంటి అద్భుతమైన పర్వత శిఖరాలను చూడవచ్చు.

హిమాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు !

ఎవరికీ తెలియని ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ లు !!

pc:youtube

కార్తికాయేశ్వర ఆలయం

కార్తికాయేశ్వర ఆలయం

చంద్రశిల ట్రెక్కింగ్ మొదట చొప్రాఅనే ప్రాంతానికి చేరుకుంటే అక్కడినుంచి ప్రవేట్ ట్రావెల్స్ అనేవి వుంటాయట. కార్తికాయేశ్వర ఆలయం ఇది కూడా రుద్రప్రయోగ్ జిల్లాలోనే వుంది. చావూర్ అనే గ్రామం నుంచి 3 కిమీ ల దూరంలో కార్తికేయస్వామి ఆలయం అనేది రుద్రనాద్ ఆలయం ఇది కూడా ఉత్తరాఖండ్ లోనే వుంది.

pc:youtube