» »నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

ప్రకృతిరమణీయతకు జలపాతాలకు, ఎన్నో రహస్యాలకు, పురాతన ఆలయాలకు, కోటలకు మన నల్లమలఅడవులు ప్రకృతి ప్రేమికులకు ఒక అడ్వెంచర్ గా భక్తుల కోర్కెలు తీర్చే అద్భుతఆలయాలకు ఆలవాలంగా వున్నాయి.ఆ అద్భుతమైన ప్రకృతిదృశ్యాలను చూడాలని ఆ కొండకోనలలో దాగివున్న ఆలయాలను దర్శించాలని అందరికి వుంటుంది.కానీ అది అంత సులభం కాదు. దట్టమైన అడవి,కొండలు,కోనలు,జలపాతాలు, క్రూరమృగాలు మరి ఇలాంటివి ఎన్నో దాటుకునివెళ్తేనే ఆ అద్భుతమైన ఆలయాలను ఆ అద్భుతమైన ప్రకృతిదృశ్యాలను చూడగలం. మరిక పురావస్త్రుశాఖవారు నల్లమల అడవులలో రాజులకాలంనాటి మహా నగరపు ఆనవాళ్ళను కనుగొన్నారు. మరి ఆ మహానగరం అనేది కాలగర్భంలో కలిసిపోయింది.

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు. ఈ అడవిలో పులులు ఎక్కువగా ఉండేవి, నాగార్జునసాగర్-శ్రీశైలం కు చెందిన పులులు ఈ అడవిలో ఒక భాగం. ఈ అడవులలో చిరుతలు తరచుగా కనిపిస్తాయి.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

ఎక్కడ వుంది?

కర్నూలు డిస్ట్రిక్ట్ ఆత్మకూర్ అటవీప్రాంతంలో కోటలయొక్క అవశేషాలను, దేవతా మూర్తులను, రాతిపై చెక్కబడిన శిలాశాసనాలను,కొలను ఇలాంటి ఎన్నో అద్భుతమైన అవశేషాలను కనుగొన్నారు.
మరి కోటకి పరిసరప్రాంతాలలో స్మశానవాటిక కోట నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంగా కనుగొన్నారు.అంతేకాకుండా అక్కడ 400 ల సంవత్సరాల క్రితం దర్గా అనేది కూడా వుండేదట.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి రాజులకోసం నిర్మించుకునే కోట రాజులకోట,రాజులు నివసించటానికి నిర్మించుకున్న నివాస గృహాలు అప్పుడు అదొక పట్టణంగా వుండేదట. ఇంతకుముందు ఇక్కడ 8 కి పైగా అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు అనేవి వుండేవి.ఇదొక మహాపట్టణంగా వుండేది.మరిప్పుడు అక్కడ కోటలోపల రంగురాళ్ళు, ఒకప్పటి పాత నాణేలు అనేవి లభ్యం అవుతున్నాయి.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి ఈ విషయం తెలిసి అనేకమంది గుప్త నిధులకోసం తవ్విన త్రవ్వకాలలో విగ్రహమూర్తులను దొంగిలించటం,లేదా ఆ ఆలయాలను ధ్వంసం చేయటం జరిగింది. మరి పురాతత్వశాఖ వారు ఇక్కడ పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపి మరి ఆ కోటయొక్క చరిత్రని వెలికితీసుకురావాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి రాయలు ఏలిన రతనాలసీమగా పేరుపొందిన ఇక్కడ వజ్రాలకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవచ్చును.అంతేకాకుండా వజ్రాలకొండలో సహజ సిద్ధంగా ఏర్పడిన పార్వతీపరమేశ్వరుల దివ్య మూర్తులను కూడా సందర్శించుకొనవచ్చును.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి ఈ నల్లమల అడవులు అనేవి కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప, మహబూబ్ నగర్ మరి నల్గొండలో కొద్దిభాగంగా వ్యాపించివున్నాయి.ఈ నల్లమలఅడవుల్లోనే మరో అద్భుతఆలయం ఇష్టకామేశ్వరి.అంటే మన మనస్సులోని కోర్కెలనుతీర్చే తల్లి. పార్వతీపరమేశ్వరులు కలిసివున్న తత్వానికి ప్రతిరూపంగా కామేశ్వరీమాతను పూజిస్తారు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

కాని భారతదేశంలోనే కాదు.ప్రపంచంలో మరెక్కడా ఇష్టకామేశ్వరీ ఆలయం అనేదిలేదు. మరది కేవలం శ్రీశైలంలోనే అటవీప్రాంతంలో మాత్రమే వుంది.ఇక మరి అమ్మవారు మన కోర్కెలు తీరుస్తుంది.ఇక అమ్మవారు మన కోరినకోర్కెలు తీరుస్తారు అన్నారుకదా ఇంకేముంది వెళ్లి అమ్మవారి అనుగ్రహం పొందితే సరిపోతుంది అనుకోవచ్చు.కాని అది అంత సులభం కాదు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి అక్కడికి వెహికల్స్ వెళ్ళవు.శ్రీశైలంక్షేత్రం నుండి కొన్ని జీపులుమాత్రమే వెళతాయి.అవి కూడా చాలా తక్కువగా వెళతాయి.గుండెధైర్యం వున్నవారు మాత్రమే ఆ జీప్ లలో వెళ్ళగలరు.ప్రయాణించగలరు.
మరి ఆలయం అనేది శిథిలావస్థలో వుంది.గుహ మాదిరిగా వుంటుంది.ఇక అమ్మవారి దివ్యమంగళస్వరూపం నాలుగుచేతులతో వుంటుంది.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

రెండు చేతులలో తామరపువ్వులు, ఒక చేతిలో రుద్రాక్షమాల, మరో చేతిలో పరమ శివుడి స్వరూపమైన లింగంఅనేది వుంటుంది. అమ్మవారు యోగినీ రూపంలో కనిపిస్తుంది.మరి ఎన్నో కష్టాలకోర్చుకొని ప్రయాణిస్తేనే మనం ఆ అమ్మవారిని దర్శించుకోగలం.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి నుదుట బొట్టుపెట్టిన వారికి 41రోజులలో తప్పకుండా వారి కోరిక తీరుతుందని భక్తులు నమ్ముతారు. మరి మనం ఏది ఇష్టంగా కోరుకుంటే అదే ఇస్తుంది ఆ తల్లి.అందుకే ఇష్టకామేశ్వరిదేవి అన్నారు.మరిక కొందరు సాధువులకి,యోగులకి అమ్మవారి నుదుటన బొట్టుపెడితే మెత్తగా తగులుతుంది నుదురు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

అంటే అది విగ్రహమా?నిజంగా అమ్మవారే అక్కడ కూర్చున్నారా?అన్నట్టుగా అనిపిస్తుందట.మరిక్కడ అంతా వుండేది చెంచులే. ఇక ఆ ప్రాంతం అనేది సెలయేళ్లశబ్దాలతో ఎంతో ఆహ్లాదకరంగా,ప్రశాంతంగా వుంటుంది.మరిక హిందూపురాణాల ప్రకారం ఇప్పటికీ చిరంజీవులుగా వున్నారని భావించేవారు అశ్వత్థామ ఒకరు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి ఈ నల్లమల అడవులలోని అశ్వత్థామకు సంబంధించిన ఆలయం వుందని అంతేకాకుండా అశ్వత్థామ తాను పూజించిన శివ లింగం ఇక్కడ ఈ నల్లమలఅడవులలో వుందని ప్రజలు భావిస్తారు. మరి ఈ నల్లమలలో 12తీర్థాలు, 5శివలింగాలు వున్నాయి.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

అయితే ఇప్పుడు 4శివలింగాలు మాత్రేమే తెలుసు.5వ శివలింగం ఎక్కడ వుందో తెలియదు.మరి ఈ ఐదో శివలింగం అనేది దట్టమైన ప్రాచీన శివలింగంగా చెప్పుకోబడే ప్రాంతంలో ఈ శివలింగం వుండవచ్చని భావిస్తారు.మరి నల్లమల అడవులవెనుక వున్న పురాతనశివలింగం గురించి తెలుసుకోవాలని డాక్యుమెంటరీతీయాలని కొందరు ఫారినర్ స్టూడెంట్స్ ఈ ప్రాంతానికి ప్రయత్నించారు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

కానీ అనుకోని విధంగా వారు మృత్యువాతపడ్డారు. మరి ప్రపంచంలోనే మోస్ట్ పాయిజనర్స్ స్పైడర్ ని ఇక్కడ కనుక్కోవటం జరిగింది. మరి 17వ శతాబ్దంలో ఈ స్పైడర్ అనేది కనిపించింది.మళ్ళీ తిరిగి 200సంల తర్వాతనే తిరిగి ఇక్కడ కనబడిందని అటవీశాఖవారు పేర్కొనటం జరిగింది.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరంతేకాకుండా ఇక్కడ గోల్డెన్ యాంట్ కూడా వుంటుంది. ఇది ప్రపంచంలోనే అరుదైనది.మరిక్కడ వున్న శివాలయాలలో ఉల్లేడుమహేశ్వర శివలింగాన్ని దర్శిస్తే అమర్నాథ్ లోని మంచులింగాన్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

ఎందుకంటే ఆ స్వామిని దర్శించటం అంత సులభంకాదు.అహోబిలంనుండి 3కిమీ ల దూరంలో కొండప్రాంతంలో మార్గం అనేది వుంటుంది.అయితే పూర్వం ఆ స్వామిని దర్శించాలంటే
కొండలు, కోనలు, జలపాతాలు దాటుకొంటూ 20కిమీ లు నడుచుకుంటూ వెళ్ళాల్సివచ్చేది.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

ఇప్పుడు ఉమామహేశ్వరఆలయానికి సమీపంలో వరకూ వాహనాలు అనేవి వెళ్తాయి.మరి అక్కడ దిగి అక్కట్నుండి తాడు పట్టుకుని కొండలు ఎక్కుతూ,దిగుతూ సెలయేళ్ళు దాటుకొంటూ వెళ్ళాలి.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నిత్యపూజ కోన

ఇక దట్టమైన అటవీమార్గమున వెళితేనే మనం ఈ క్షేత్రాన్ని చేరుకోగలం.అంతే కాకుండా ఈ నల్లమల అడవులలో 100సంల క్రితమే నిజాం నవాబుల కాలం నాటి వేసవి విడిదిల కోటలశిధిలాలుఅనేవి కనపడతాయి.

PC:youtube

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి ఈ నల్లమల అడవులలోనే మరో ప్రదానమైన శైవక్షేత్రం సలేశ్వరం. ఏడాదిలో కేవలం 5రోజులు మాత్రమే తెరిచివుంచే ఈ ఆలయానికి చేరుకోవటం కూడా చాలా కష్టం.20కిమీ లు కొండలు, కోనలుదాటుతూ వెళ్లి మరి ఆ పరమశివుని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయంపై చెంచులకి మాత్రమే అధికారం వుంటుంది.

చిత్ర కృప : telangana tourism

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరొక ప్రధాన శైవక్షేత్రం నందిమల్లన్న శివాలయం.మరి ఈ ఆలయానికి వెళ్ళటం కూడా అంత సులభంకాదు. మరి ఎన్నో కష్టనష్టాలకోర్చి భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటూవుంటారు. శివలింగంఅనేది 30అడుగుల పొడవు, 20అడుగుల ఎత్తుగుహలో ఆ స్వామివారు వుంటారు.

చిత్ర కృప : B Venkata Reddy

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

మరి చెంచుల ఆరాధ్యదైవమైన ఆ పరమశివుడు క్రీశ 6వ శతాబ్దానికి ముందే ప్రతిష్టించివున్నాడని అయితే అక్కడ గిరిజనులు మాత్రమే వుత్సవాలు జరిపేవారు. కాకతీయులకాలం నుండి అక్కడ వుత్సవాలనేవి ప్రారంభించబడ్డాయి.

చిత్ర కృప : మా రాయలసీమ

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

కాబట్టి ఈ విధంగా నల్లమలలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు, ప్రకృతిదృశ్యాలు, వన్యప్రాణసంరక్షణకు సంబంధించిన కేంద్రాలుఅనేవి ఎన్నో వున్నాయి. కాబట్టి వుత్సాహంకలవారు, అడ్వెంచర్స్ ని ఇష్టపడేవారు ఆ ప్రాంతానికి వెళ్లి స్వయంగా ఆ దృశ్యాలను చూడగలరు.

చిత్ర కృప : telangana tourism

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

ఎలా వెళ్ళాలి?

రోడ్డు ద్వారా

బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలా చౌకగా, తేలికగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్నూలుకు సరైన ధరలలో కాబ్స్ కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి.

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

రైలు ద్వారా

కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. హైదరాబాద్ నుండి రైలులో, అక్కడ నుండి రోడ్డు ద్వారా కర్నూలుకి రైలు ప్రయాణం చాలా తేలిక. కర్నూల్ కి స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు !

వాయు మార్గం ద్వారా

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

Please Wait while comments are loading...