Search
  • Follow NativePlanet
Share
» »సౌత్ ఇండియా లో జూలై పర్యటన !

సౌత్ ఇండియా లో జూలై పర్యటన !

అద్భుతమైన అనుభూతులు కలిగించే దక్షిణ భారత దేశ పర్యాటక ప్రదేశాలలో, చక్కని ప్రకృతి తో పాటు, దాని సంస్కృతి, వారసత్వం మరియు ఆయా స్థానిక ఆహారాల రుచులు మొదలైనవి ఎన్నిటినో ఆనందించవచ్చు.

దక్షిణ భారత దేశ పర్యాటక ప్రదేశ అందాలు సంవత్సరం పొడవునా చెప్పుకో దగినవే, కాని కొన్ని ప్రదేశాలలో ఈ వర్షాకాలం మరింత పునరుజ్జీవిమ్పబడి ఆహ్లాదకరంగా వుంటుంది. తొలకరి చినుకులు ఆనందం ఈ ప్రదేశాలలో మరువ లేనిది. మరి వర్ష రుతువులో దక్షిణ భారత దేశంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి అనే దానికి మేము కొంత మార్గదర్శకత చిత్ర సహిత ఈ వ్యాసంలో అందిస్తున్నాం. పరిశీలించండి. అయితే, అన్నీ చూసిన తర్వాత, ఏ ప్రదేశానికి వెళ్ళాలా అని మీరు ఆలోచనలో పడటం కూడా ఖాయం, మరి ప్రదేశాలు అంత అందంగా వుంటాయి.

ఇది కూడా చదవండి : తమిళనాడు పది ఆకర్షణలు

జూలైలో సందర్శించ దగిన ప్రధాన ప్రదేశాలు

చెన్నై హోటల్ వసతులకు క్లిక్ చేయండి

తంజావూర్

తంజావూర్

తంజావూర్ అందాలు అక్కడ కల వారి పొలాలు, కొబ్బరి తోటలు, నీటి ప్రవాహాలలో వున్నాయి. తమిళనాడు లో కల తంజావూర్ ను ఆ రాష్ట్ర అన్నపూర్ణ అంటారు. ఇక్కడ కళలు, శిల్ప సంపద, సంస్కృతి వంటివి పుష్కలంగా చూడవచ్చు. ఇక్కడ కల చోళ దేవాలయాలు యునెస్కో హెరిటేజ్ సైట్ లు. దేవాలయాల శిల్ప శైలి, తాన్జోర్ పెయింటింగ్ లు, అనేక జలపాతాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

Photo courtesy: Prince Gladson

కుర్తాళం

కుర్తాళం

కుర్తాళం పేరు చెప్పగాని అక్కడ కల జలపాతాలు గుర్తుకు వచ్చేస్తాయి. ఈ ప్రదేశాన్ని దక్షిణ భారత దేశపు చికిత్సాలయంగా చెపుతారు. అనేక జలపాతాలు, రిసార్ట్ లు మొదలైన వాటితో కుర్తాళం పర్యాటకులకు ఒక పూర్తి విశ్రాంతిని ఇచ్చే ప్రదేశంగా వుంటుంది. కనుక ఈ వర్షాకాలంలో ఈ ప్రదేశం తప్పక చూసి ఆనందించండి.

Photo courtesy: Sundaram

కూనూర్

కూనూర్

దక్షిణ భారత దేశంలో వర్షాకాలంలో చూడ దాగిన మరొక ఆకర్షణీయ ప్రదేశం కూనూర్. ఊటీ కి సోదరి హిల్ స్టేషన్. ఇక్కడ అనేక తేయాకు తోటలు, ట్రెక్కింగ్ మార్గాలు పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి. వర్షాలు ప్రదేశ అందాలను రెట్టింపు చేస్తాయి. చక్కని రోడ్డు మార్గాలు మీ డ్రైవింగ్ ను అతి సులువు చేస్తాయి. అన్నిటిని మించి తక్కువ సంఖ్యలో వుండే పర్యాటకులు తో ప్రదేశం హాయిగా వుంటుంది.

Photo courtesy: Thangaraj Kumaravel

కొల్లి హిల్స్

కొల్లి హిల్స్

కొల్లి కొండలు చేరాలంటే, 70 సన్నని వంపులు కొండలలో ప్రయాణించాలి. ౩౦౦ అడుగుల ఎత్తునుండి పడే ఆగాయ జలపాతాలు చూడాలంటే సుమారు 1300 మెట్లు ఎక్కాలి. ఎంతో సాహస కార్యంగా వుంటుంది. కొల్లి హిల్స్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందక ఇంకనూ ప్రకృతి అందాలు సహజంగానే వుంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ లేదా జలపాతాల సందర్శన వంటివి చేసి ఆనందించవచ్చు.

Photo courtesy: Simply CVR

ధర్మపురి

ధర్మపురి

తక్కువ పర్యాటకులు , వర్షాకాలంలో అధిక ఆనందం వుండే ప్రదేశం ధర్మపురి. ఇక్కడ కల హోగేనక్కల్ జలపాతాలు పర్యాటక ప్రసిద్ధి. తమిళనాడు , కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో కల ఈ ప్రదేశంలో కావేరి నది తమిళనాడు లోకి ప్రవేశిస్తుంది. అతి వేగంగా పడే జలపాతాలు పొగను సృష్టించడంతో వీటికి హోగె నక్కల్ జలపాతాలు అని పేరు వచ్చింది. వర్షాలు, అధిక జలాలను, పర్యాటకులను ఒకేసారి ఇక్కడకు రప్పిస్తాయి.
Photo courtesy: Ashwin Kumar

మున్నార్

మున్నార్

మున్నార్ అంటే మూడు నదుల సంగమం అని అర్ధం. మున్నార్ కేరళలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వర్ష రుతువులో సౌత్ ఇండియా లో చూడ దాగిన ప్రదేశాలలో ఒకటి. ఎక్కడ చూసినా పచ్చటి తేయాకు తోటలు విస్తరించి వుంటాయి. కొన్ని వందల ఏళ్ల నాటి పురాతన వృక్షాలు, కాలి బాటలు అందమైన పక్షులు చూడటం మున్నార్ లో మాత్రమే సాధ్యం. వేడి టీ కప్పులతో సుదీర్ఘ నడకలు చేసి ఈ ప్రదేశ అందాలు ఆస్వాదించండి.

Photo courtesy: Tornado Twister

అల్లెప్పి

అల్లెప్పి

అల్లెప్పి ని తూర్పు దేశపు వెనిస్ నగరం అంటారు. సౌత్ ఇండియా లో వర్ష రుతువులో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా మీ ప్రియమైన వారితో తప్పక చూడదగిన ప్రదేశం. ఎన్నో ప్రకృతి దృశ్యాలు. బ్యాక్ వాటర్ అనుభవాలు, నీటి కాలువలు, బీచ్ లు హౌస్ బోటు లు నీల ఆకాశాలు, పొడవైన కొబ్బరి చెట్లు, అన్నీ కలిసి మీకు ఒక స్వర్గం అందిస్తాయి.

Photo courtesy: Raj

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ పర్యటన ఎంతో పోదు పైనది, ఆనందకరమైనది. వర్షాకాలంలో ఇక్కడి హోటల్స్ మీకు డిస్కౌంట్ లు కూడా ఇస్తాయి. వెంబనాడ్ సరస్సు ఇండియా లో అతి పెద్ద మరియు పొడవైన సరస్సు. ఇక్కడ కల అనేక రిసార్ట్ లు మీకు చక్కటి ఆతిధ్యం ఇస్తాయి. బోటు హౌస్ ఆతిధ్యం కూడా పొందవచ్చు. చేపలు పట్ట వచ్చు.

Photo courtesy: Kamaljith K V

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

జోగ్ జలపాతాలు సౌత్ ఇండియా లో, కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ జలపాతాలు సౌత్ ఇండియా లో రెండవ అధిక ఎత్తు నుండి పడే జలపాతాలు. షరావతి నది నుండి పుట్టే ఈ జలపాతాలు సుమారు 830 అడుగుల ఎత్తు నుండి కిందకు పడతాయి. జలపాతాల కిందకు వెళ్ళాలంటే సుమారు 1400 మెట్లు దిగాలి. రాజ, రోరార్, రాకెట్, రాణి అనే పేర్ల తో ఈ జలపాతాలు నాలుగు ప్రవహాలుగా ప్రవహిస్తాయి.
Photo courtesy: Shuba

చిక్క మగళూర్

చిక్క మగళూర్

సౌత్ ఇండియాలో కర్నాటక రాష్ట్రంలోని, చిక్క మగళూర్ జిల్లాలో కల చిక్క మగళూర్ తప్పక చూడదగిన పర్యాటక ప్రదేశం. దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యాల తోటలు, కాఫీ తోటలు కలిగి పర్యాటక స్వర్గం వలె వుంటుంది.ఇక్కడ కాఫీ తోటలు అధికం కనుక దీనిని కాఫీ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ప్రసిద్ధ హిల్ స్టేషన్ గా పేరు గాంచినది. వసతి కి అనేక హోటల్లు, రిసార్ట్ లు కలవు. ఈ వర్షాలలో మీ అదృష్టం బాగుంటే, నాట్యాలు చేసే అందమైన నెమళ్ళు కూడా వాటి సహజ ప్రదేశాలలో చూడవచ్చు. Photo courtesy: Vikram Vetrivel

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X