Search
  • Follow NativePlanet
Share
» »సమ్మర్ ట్రిప్ హాయిగా..సాఫీగా.. సాగాలంటే ప్రయాణంలో ఈ ఆహార జాగ్రత్తలు తీసుకోండి

సమ్మర్ ట్రిప్ హాయిగా..సాఫీగా.. సాగాలంటే ప్రయాణంలో ఈ ఆహార జాగ్రత్తలు తీసుకోండి

సాధారణంగా వీకెండ్స్ లేదా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలని చాలా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళి తిరిగి రావాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సు ఎక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకోవడం లేదా వాయిదాలు వేస్తుంటారు. కొంత మంది మాత్రం రెగ్యులర్ గా ఇండ్లలో తీసుకునే ఆహారాల కంటే భిన్నంగా కంటికి కలర్ ఫుల్ గా కనిపించే ప్రతి ఆహారాపదార్థాన్ని, లేదా జంక్ ఫుడ్ ను రుచి చూడాలని అనుకుంటారు. ఈ ఉత్సాహంలో ఆడ్రినల్ స్థాయి పెరిగి వివిధ రకాల ఆహారాలు తీసుకోవడానికి అత్యుచ్చాహం చూపిస్తారు. అయితే ఏమైన జరుగుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. మీరు తినే ఆహారాన్ని బట్టే మీ ఆరోగ్య మరియు మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది.

సహజంగా పెద్దవారిలో కొంత మంది విహార యాత్రల్లో తినే వేళలు..తినే ఆహారాపదార్థాల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినేస్తుంటారు. దాని వల్ల ప్రయాణం భారంగా మారుతుంది. బస్, కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీన్నే మోషన్ సిక్‌నెస్ అంటారు. కొందరికి షిప్‌లలో ప్రయాణించేటప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, వేసవి సెలవుల్లో ఎక్కువ రోజులు మీరు ఎక్కడైకనా ప్రయాణం చేయాలనుకొన్నప్పుడు ముందస్తు ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం హాపీగా...సాఫీగా జరగుతుంది. సమ్మర్ ట్రిప్ హాయిగా..సాఫీగా సాగాలంటే ప్రయాణంలో ఈ ఆహార జాగ్రత్తలు తీసుకోండి..

బనానా చిప్స్ !

బనానా చిప్స్ !

అరటికాయ చిప్స్ , డీప్ ఫ్రై చేసినవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇవి స్వీట్ వి లేదా స్పైసీవి అందుబాటులో ఉంటాయి. ఇవి రెండు వారాల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

గోధుమ లడ్డు!

గోధుమ లడ్డు!

గోధుమ లడ్డులో చాలా న్యూట్రీషియన్స్ మరియు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని మూత టైట్ గా ఉండే డబ్బాలో నిల్వచేసుకోవచ్చు. 15 రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

సోయా స్టిక్స్ !

సోయా స్టిక్స్ !


గ్రాసరీ షాప్స్ లో సోయా స్టిక్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకా మనం ఇంట్లోనే సులభంగా తయారుచేస్తుంది. ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇవి 15నుండి 20రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి

కుక్కీస్!

కుక్కీస్!


గోధుమ పిండి, కుక్కీస్ హెల్తీ స్నాక్స్ మరియు అన్ని వయస్సుల వారికి ఆరోగ్యకరమైనవి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకుంటా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి. వీటిని కాఫీ లేదా టీ కాంబినేషన్ తో తినవచ్చు. ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి

పెసరపప్పు పరోటా !

పెసరపప్పు పరోటా !

పెసరపప్పు పరోటాలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడంతో పాటు, ఎక్కువ సమయం ఆకలి కాకుండా చూస్తుంది. ఊరగాయతో తినడం హెల్తీ ఆప్షన్ . మూడు, నాలుగు రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

చివడ మిక్సర్!

చివడ మిక్సర్!

అటుకులు లేదా చివ కు వేయించిన వేరుశెనగలు, కరివేపాకు, శెనగపప్పు వేస్తే రుచికరంగా మాత్రమే కాదు, ఎక్కువ రోజులు నిల్వఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి నెల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

వేయించిన ఆలూ సబ్జీ!

వేయించిన ఆలూ సబ్జీ!

బంగాళదుంపలు అన్ని వయస్సుల వారు తినడానికి ఇష్టపడుతారు. అయితే వాటిని సరైన విధానంలో తయారుచేయాలి. ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. దీన్ని పరాట లేదా పూరిలతో తినవచ్చు. ఇది కనీసం రెండు లేదా మూడు రోజులు ఫ్రెష్ గా ఉంటుంది.

సుహాలి!

సుహాలి!

సుహాలి, ఫై చేసిన మత్రిలు, పిల్లలకు ఇవి చిరుతిండ్లలో ఒక హెల్తీ, అండ్ ఫేవరెట్ స్నాక్. ఇది క్రిస్పిగా మరియు క్రంచీగా ఉంటుంది. వీటిని టీ లేదా కాఫీతో తీసుకోవచ్చు. ఇవి నెల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

కాక్ర:

కాక్ర:

మరో హెల్తీ అండ్ క్రంచీ స్నాక్.కాక్ర. దీన్ని బట్టర్, పికెల్ లేదా చట్నీతో తినవచ్చు, ఇది మేతీ, క్యాప్సికమ్, జీర, సాల్ట్ తో తయారుచేస్తారు. ఇది నెల వరకు ఫ్రెష్ గా ఉంటుంది

పీనట్ బట్టర్ చాక్లెట్ గ్రాన్యులా బార్ !

పీనట్ బట్టర్ చాక్లెట్ గ్రాన్యులా బార్ !

పీనట్ బటర్ మరియు వోట్మీల్ తో తయారుచేసి హెల్తీ న్యూట్రీషియన్ బార్స్ కు చాక్లెట్స్ చిప్స్ జోడించిన తయారుచేయడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు అద్భుతమైన రుచి ఉంటుంది. ఇవి ఒక నెలకు పైగా నిల్వ ఉంటాయి.

స్టప్డ్ పాయింటెడ్ సబ్జీ

స్టప్డ్ పాయింటెడ్ సబ్జీ

దీన్ని పార్వాల్ అని కూడా పిలుస్తారు. కొన్ని రకాల మసాలాలను స్టఫ్ చేసి వండటం వల్ల అద్భుతమైన రుచితో ఉంటాయి. ఇందులో అనేక రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది . ఇది కనీసం రెండు మూడు రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

చీజ్ స్ట్రా:

చీజ్ స్ట్రా:

పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ లో ఇది ఒకటి. ఇది దాదాపు నెలకి పైగా నిల్వ ఉంటాయి. విరిగిపోకుండా తయారుచేసిన షేప్ లో అలాగే ఫ్రెష్ గా ఉండి, కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి.

కుర్మురా మిశ్రమం లేదా ముధి

కుర్మురా మిశ్రమం లేదా ముధి

కుర్మురా లేదా ముధి సాదారణంగా బొరుగులతో తయారుచేస్తారు. లాంగ్ ట్రిప్ కు వీటిని తీసెకెళ్ళడం ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. అంతే కాదు , వీటిని వివిధ రకాలుగా తింటారు. ఇంకా ఇతర ఆహారాల మీద కోరికలు కలగకుండా చేస్తుంది. . కాస్త కారం పెట్టుకుంటే దాదాపు నెలవరకు ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి.

మామిడికాయ ఊరగాయతో పూరి

మామిడికాయ ఊరగాయతో పూరి

లాంగ్ జర్నీలో పూరీ తినడం ఫ్రెష్ గానే అనిపించవచ్చు . పూరితో ఫ్రై చేసిన ఆలూ లేదా మ్యాంగో పికెల్ మంచి హెల్తీ కాంబినేషన్. లాంగ్ జర్నీలో వీటిని తీసుకెళ్ళడం రుచికరమైనవి మాత్రమే కాదు. మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కనీసం రెండు మూడు రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.

మేథీ తెప్లా

మేథీ తెప్లా

ఎక్కువ రోజులు ట్రావెల్ టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు మేథీ తెప్లా ఆరోగ్యకరమైన ఆహారం. ఎందుకంటే ఇందులో విటమిన్స్ మరియు మినిరిల్స్ అధికంగా ఉంటాయి, అంతే కాదు ఇవి ఆకలిని కంట్రోల్ చేసి, చిరుతిండ్లు, జంక్ ఫుడ్స్ తినకుండా ఆపు చేస్తుంది. కాబట్టి, లాంగ్ ట్రిప్ వెళ్ళే వారు మేతి తెప్లాను తయారుచేసుకుని వెంటతీసుకెళ్ళడం మంచిది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X